మహిళలకు వడ్డీలేని రుణాలు- మెరుగైన జీవనానికి కృషిచేస్తాం : పల్లె సింధూర రెడ్డి - TDP MLA Candidate exclusive

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 9, 2024, 1:26 PM IST

thumbnail
మహిళలకు వడ్డీలేని రుణాలు- మెరుగైన జీవనానికి కృషిచేస్తాం : పల్లె సింధూర రెడ్డి (ETV Bharat)

Puttaparthi TDP MLA Candidate Palle Sindhura Reddy Interview: జిల్లా పుట్టపర్తిలో మహిళలు, యువతకు ఉపాధి కల్పించే కుటీర పరిశ్రమల ఏర్పాటే తన లక్ష్యమని పుట్టపర్తి టీడీపీ అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి చెప్పారు. పుట్టపర్తి నియోజకవర్గంలో తాగునీటి సమస్యను పరిష్కరించటమే తొలి ప్రాధాన్యత అని ఆమె స్పష్టం చేశారు. తన మామయ్య పల్లె రఘునాథరెడ్డి నియోజకవర్గాన్ని చాలా వరకు అభివృద్ధి చేశారని ఆయన మార్గంలోనే తాను ప్రజలకు అన్నివిధాలా అండగా ఉంటానన్నారు. మహిళలకు వడ్డీలేని రుణాలు ఇప్పించడంతోపాటు, వారి జీవన పరిస్థితులు మెరుగుపడేలా స్వయం ఉపాధి కల్పించే దిశగా నడిపిస్తానన్నారు.

అర్హులైన అందరికీ సూపర్ సిక్స్ పథకాలు చేరువచేస్తానని తెలిపారు. ఈ సారి తప్పకుండా ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి అన్నివిధాలా విఫలమైన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారంటున్న పల్లె సింధూర రెడ్డితో మా ప్రతినిధి ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.