చంచల్​ గూడ జైలులో రిమాండ్ ఖైదీ మృతి - పోలీసులపై మృతుడి కుమారుడి అనుమానం

By ETV Bharat Telangana Desk

Published : Feb 12, 2024, 5:10 PM IST

thumbnail

Prisoner Died In Chanchal Guda Jail : చంచల్ గూడ జైలులో ఖైదీగా ఉన్న ఓ వ్యక్తి మృతి కలకలం రేపుతోంది. సెల్‌ఫోన్ చోరీ కేసులో కోర్టుకు హాజరు కావడం లేదని అతనిపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేయగా ఈనెల 6న రాజేంద్ర నగర్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి అనంతరం చంచల్ గూడ జైలుకు తరలించారు. కాగా గత రాత్రి రాజు అస్వస్థతకు గురవ్వగా జైలు అధికారులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఈ విషయాన్ని అతని కుటుంబ సభ్యులకు తెలిపారు. 

Death Of A prisoner In Chanchal Guda Jail : అతని కుమారుడు, బంధువులు ఉస్మానియా శవాగారంలో మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. తన తండ్రిని అన్యాయంగా తీసుకెళ్లారని, పోలీసులే కొట్టి చంపేశారని మృతుని కుమారుడు ఆరోపిస్తున్నాడు. తలకు బలమైన గాయం ఉందని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.