150 కిలోల గంజాయి సీజ్​- నలుగురు అరెస్ట్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 22, 2024, 3:50 PM IST

thumbnail

Police Arrest Illegal Ganja Transporters in alluri District : అక్రమంగా గంజాయి తరలిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్​ చేశారు. వారి వద్ద నుంచి కారు, ద్విచక్రవాహనం సహా 150 కిలోల గంజాయిని అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీఐ రుద్రశేఖర్, ఎస్ఐ సంతోష్​లు అందించిన వివరాల మేరకు ఉత్తరప్రదేశ్​కు చెందిన ఇద్దరు వ్యక్తులతో పాటు అరకులోయ మండలానికి చెందిన ఇద్దరు యువకులు లారీలో గంజాయిని తరలించేందుకు ప్రయత్నిస్తుండగా వాహనాల తనిఖీ సమయంలో వారు పోలీసులకు చిక్కారు. 

police Seized 150 Kgs Ganja : ఈ ఘటనలో లారీలో, గంజాయి పాటు నలుగురు వ్యక్తులను గంజాయికి పైలట్లుగా వెళుతున్న కారు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించామన్నారు. ఒడిస్సాలోని ఓ ప్రాంతంలో గంజాయిని కొనుగోలు చేసి ఉత్తరప్రదేశ్​కు తరలించేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకున్నామని పోలీసులు  తెలిపారు. ఈ కేసులో సంబంధం ఉన్న మరి కొంతమంది వ్యక్తుల కోసం విచారణను ముమ్మరం చేసామన్నరు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.