మౌలిక వసతులు కల్పించే ప్రభుత్వాలు ఉంటే ఉద్యోగాల కల్పన సులభతరం- ఎన్​ఆర్​ఐ సుందర్ - NRI Mallarapu Sundar Interview

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 7, 2024, 1:30 PM IST

thumbnail
మౌలిక వసతులు కల్పించే ప్రభుత్వాలు ఉంటే ఉద్యోగాల కల్పన సులభతరం- ఎన్​ఆర్​ఐ సుందర్ (etv bharat)

NRI Mallarapu Sundar Interview : మౌలిక వసతులు కల్పించే ప్రభుత్వాలు ఉంటే ఉద్యోగాల కల్పన సులభతరమవుతుందని ప్రవాసాంధ్రుడు మల్లవరపు సుందర్ తెలిపారు. యువతకు ఉద్యోగాలతో పాటు సరైన నైపుణ్య శిక్షణా అందించే వారికే ఓటేయాలని పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా చేబ్రోలుకు చెందిన సుందర్ 2012లో లండన్ వెళ్లారు. కొన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసి అనంతరం సొంతంగా ఉద్యోగ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే యువతకు సూచనలు అందిస్తుంటారు. ప్రతి సార్వత్రిక ఎన్నికలకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు తప్పనిసరిగా రాష్ట్రానికి వస్తానంటున్న ప్రవాసాంధ్రుడు సుందర్ మా ప్రతినిధి  వీఎస్​ఎన్​ కృష్ణ ముఖాముఖి.

మానవ వనరులు అధికంగా ఏపీలో ఉండటం అదృష్టమన్నారు. ఎవరు యువతకు మంచి భవిష్యత్తును ఇవ్వగలరు, ఏ నాయకుడు అధికారంలోకి వస్తే రాష్ట్రం మెరుగవుతుందో అలాంటి వారినే గెలిపించుకోవాలని సుందర్​ సూచించారు. నైపుణ్యాభివృద్దితో యువతకు మెరుగైన ఉద్యోగావకాశాలు దక్కే అవకాశం ఉంది. కనుక చంద్రబాబు నాయుడు దానిపై దృష్టి సారించారన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.