LIVE: విశాఖ తూర్పు నియోజకవర్గంలో లోకేశ్​ శంఖారావం యాత్ర ప్రత్యక్షప్రసారం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 18, 2024, 11:34 AM IST

Updated : Feb 18, 2024, 12:38 PM IST

thumbnail

Nara Lokesh Live: ముఖ్యమంత్రి జగన్​ మోహన్​ రెడ్డి అరాచకాలను, అవినీతిని ఎండగట్టేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ చేపట్టిన శంఖారావం యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఈ యాత్రకు అధిక సంఖ్యలో ప్రజలు హాజరవుతున్నారు. తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు, శ్రేణులు భారీగా తరలివస్తున్నారు. శంఖారావం యాత్ర ఆదివారం (నేడు) విశాఖలో జరగనుంది. 

ఉదయం 10 గంటలకు విశాఖ తూర్పు నియోజకవర్గంలో లోకేశ్​ శంఖారావం సభ నిర్వహించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటిగంటకు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో శంఖారావం సభ జరగనుంది. సాయంత్రం 4 గంటలకు విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో సభ నిర్వహించనుండగా లోకేశ్​ ఈ సభల్లో పాల్గొననున్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్​సీపీ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని లోకేశ్​ పిలుపునిస్తున్నారు. వైఎస్సార్​సీపీ ప్రభుత్వ ఆధీనంలో భూ అక్రమాలు, అవినీతి పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం అనేక సమస్యలను ఎదుర్కోంటోందని తాము అధికారంలోకి రాగానే ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తామని అన్నారు.

Last Updated : Feb 18, 2024, 12:38 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.