LIVE: నర్సీపట్నం నియోజకవర్గంలో లోకేశ్ శంఖారావం సభ- ప్రత్యక్షప్రసారం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 20, 2024, 3:25 PM IST

Updated : Feb 20, 2024, 4:24 PM IST

thumbnail

Nara Lokesh Shankaravam Yatra at Narsipatnam Live: వైఎస్సార్​సీపీ పాలనలో ముఖ్యమంత్రి జగన్​ మోహన్​ రెడ్డి అరాచకపాలనను ప్రజల్లో ఎండగట్టేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ శంఖారావం యాత్ర చేపట్టారు. ప్రభుత్వం అవినీతి, అక్రమాలను ప్రజలకు వివరిస్తూ లోకేశ్​ శంఖారావం యాత్రలో ప్రజలతో మమేకమవుతున్నారు. నేడు ఉమ్మడి విశాఖ జిల్లాలో నారా లోకేశ్ శంఖారావం యాత్రలో జరగుతోంది. ఈ క్రమంలో ఈ యాత్ర నేడు మాడుగుల, నర్సీపట్నం, పాయకరావుపేటలో కొనసాగనుంది. ఉదయం మాడుగుల శంఖారావం సభలో లోకేశ్ ప్రసంగించారు. 

రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం అప్పులమయం చేసిందన్న లోకేశ్, రెండు నెలలు ఓపిక పడితే టీడీపీ-జనసేన ప్రభుత్వం ఖాయమని అన్నారు. జగన్‌ పాలనలో విశాఖలో రోజుకో కిడ్నాప్‌, విధ్వంసం, హత్య, భూకుంభకోణం జరుగుతున్నాయి. చంద్రబాబు హయాంలో విశాఖను  ఉపాధికి రాజధానిగా మారిస్తే, జగన్‌ గంజాయికి దేశ రాజధానిగా మార్చేశారు. ఉత్తరం నియోజకవర్గంలో వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న కె.కె.రాజు రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తూ, గంజాయి విచ్చలవిడిగా అందేలా చేస్తున్నాడని మండిపడ్డారు. టీడీపీ నాయకులను, కార్యకర్తలను బెదిరించి పలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడని అన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఇటువంటి వారికి బుద్ధి చెబుతాం అని లోకేశ్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం నర్సీపట్నం నియోజకవర్గంలో లోకేశ్ శంఖారావం సభ ప్రత్యక్ష ప్రసారం మీకోసం.

Last Updated : Feb 20, 2024, 4:24 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.