కూటమి విజయంతోనే రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సాధ్యం : నాదెండ్ల మనోహర్ - Nadendla Manohar tour in Tenali

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 10, 2024, 5:31 PM IST

thumbnail

Nadendla Manohar tour in Tenali Constituency : కూటమి అధికారంతోనే రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని జనసేన తెనాలి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ అన్నారు. గుంటూరు జిల్లా తెనాలి నియోజవర్గంలోని గ్రామాల్లో పర్యటించిన మనోహర్ కూటమి నాయకులతో సమావేశమయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు తదితర అంశాలపై నాయకులు, కార్యకర్తలతో చర్చించారు. అనంతరం గ్రామాల్లోని ప్రజలతో మమేకమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల ప్రచారమే కాకుండా క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు పర్యటించామని మనోహర్ తెలిపారు. 

అనంతరం మనోహర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి పనులను చేపట్టలేదు. రైతులకు కూడా సబ్సిడీపై రావాల్సిన యంత్రాలు సక్రమంగా రావటం లేదు. ప్రత్యేకంగా జనసేన, టీడీపీ కార్యకర్తలకు ఎటువంటి పథకాలు అందకుండా చేస్తున్నారు. వారికి ఇవ్వాల్సిన ఇళ్ల స్థలాలు, పెన్షన్లు రేషన్ కార్డులు తదితర సమస్యలు ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ప్రస్తుతం చేస్తున్నది ఎన్నికల ప్రచారమే కాకుండా క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికని వెల్లడించారు. అధికారంలోకి వచ్చాక గ్రామాల్ని అభివృద్ధి చేయటం కోసం ప్రత్యేకంగా ప్రణాళిక సిద్ధం చేస్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.