వేతనాలు లేకుండా పనులా ? - ఎమ్మెల్యే బాలినేని వాహనాన్ని అడ్డుకున్న మున్సిపల్ కార్మికులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 8, 2024, 5:24 PM IST

thumbnail

Municipal Workers Protest at Balineni Srinivasa Reddy House: తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు ఒంగోలులో మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసం ఎదుట ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే బాలినేని తన నివాసం నుంచి బయటకు వస్తుండగా ఆయన వాహనాన్ని అడ్డుకుని నిరసన తెలిపారు. 9 నెలల నుంచి పెండింగ్​లో ఉన్న వేతనాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. వేతనాలు ఇవ్వకుండా పనులు చేయాలంటే ఎలా చేస్తామని మున్సిపల్ కార్మికులు ప్రశ్నించారు. ఆయన స్పందించి రెండు, మూడు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు. వాహనం అడ్డుకోవడంతో బాలినేని సెక్యూరిటీ సిబ్బంది, కార్మికులకు మధ్య వాగ్వాదం జరిగింది. 

"గత తొమ్మిది నెలల నుంచి మాకు సక్రమంగా వేతనాలు లేవు. దీంతో మేము జీవనం సాగించడం చాలా కష్టతరంగా ఉంది. వేతనాలు ఇవ్వకుండా పనులు చేయాలంటే ఎలా చేస్తాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి మా న్యాయమైన సమస్య పరిష్కరించాలని కోరుతున్నాం." - మున్సిపల్ కార్మికులు

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.