'భువనగిరి హాస్టల్​ పరిశీలించిన కవిత - మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి'

By ETV Bharat Telangana Desk

Published : Feb 6, 2024, 3:11 PM IST

thumbnail

MLC Kavitha On Visit To Suicidal Student Hostel : భువనగిరి పట్టణంలో ఇటీవల ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్న వసతి గృహాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సందర్శించారు. విద్యార్థినుల మృతిపై హాస్టల్​లో ఉన్న వారిని ఆరా తీశారు. అనంతరం అక్కడి పరిస్థితుల గురించి ఆమె అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు చనిపోయి మూడు రోజులు అవుతున్నా పోలీసులు ఇంకా కారణాలు వెతికే పనిలోనే ఉన్నారని ఆరోపించారు. ఇద్దరు విద్యార్దులు ఒకటే గదిలో ఆత్మహత్య చేసుకోవడం, సూసైడ్ లెటర్​ అనుమానాస్పదంగా ఉన్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దర్యాప్తు వేగవంతం చేసి దోషులను పట్టుకోవాలని ఆమె పోలీస్​ అధికారులను కోరారు. 

Yadadri Suicde News Update : విద్యార్థినుల ఆత్మహత్యలపై తల్లిదండ్రుల్లో భయాందోళనలు ఉన్నాయని కవిత విచారం వ్యక్తం చేశారు. పదో తరగతి పిల్లలు ప్రెజర్ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారా? ఇంకా ఏమైనా ఉందా ? అనే విషయాన్ని కూడా తల్లిదండ్రులు గుర్తించాలన్నారు. ఇలాంటివి జరగకుండా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని కవిత సూచించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.