ఆ స్థానం నుంచి సీఎం రేవంత్​రెడ్డి సోదరుడు పోటీ చేస్తానంటే అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం: వంశీ చంద్‌రెడ్డి

By ETV Bharat Telangana Team

Published : Feb 10, 2024, 12:50 PM IST

thumbnail

MLA Vamshi Chand on MP Seat : పార్లమెంట్​ ఎన్నికల సమయం దగ్గరవుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆశావహులలో రోజురోజుకూ ఉత్కంఠ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy) సోదరుడు తిరుపతి రెడ్డి కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేయాలనుకుంటే తామంతా కలిసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకునేందుకు కృషి చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ కమిటీ సభ్యుడు వంశీచంద్‌రెడ్డి తెలిపారు. మహబూబ్‌నగర్‌ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. తిరుపతి రెడ్డిని ముఖ్యమంత్రి సోదరుడిగా కాకుండా, కాంగ్రెస్‌ పార్టీ క్రీయాశీల నాయకునిగా గుర్తించాలని పేర్కొన్నారు. 

Vamshi Chand Interesting Comments : మహబూబ్‌నగర్‌ ఎంపీ స్థానానికి ఇప్పటికి కొంత మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని వంశీచంద్​ అన్నారు. వారితో పాటు దరఖాస్తు చేయని వారికీ పార్టీ టిక్కెట్‌ ఇచ్చినా తామంతా ఏకతాటిపై నిలబడి గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఇంఛార్జ్‌గా ఉన్న పార్లమెంట్‌ స్థానాన్ని గెలిపించుకోవడమే తమ ధ్యేయమన్నారు. ఇప్పటికే 17 లోక్​సభ నియోజకవర్గాలకు 309 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. పార్టీ అధిష్ఠానం నిర్ణయించిన వారికే సీట్లు కేటాయిస్తామని సీఎం రేవంత్​ రెడ్డి అధ్యక్షతన జరిగిన పీఈసీ సమావేశంలో పార్టీ స్పష్టం చేసింది. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.