టీడీపీలోకి చేరుతాననే భయంతోనే అక్రమ కేసులు: కార్పొరేటర్‌ జయరాం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 11, 2024, 5:57 PM IST

thumbnail

MLA Katasani Rambhupal Reddy Filed an Illegal Case Against YCP Corporator : వైసీపీ కార్పొరేటర్ జయరాంపై పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అక్రమ కేసులు పెడుతున్నారని దళిత సంఘాల నాయకులు కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. కర్నూలు నగరంలో 30వ వార్డు వైసీపీ కార్పొరేటర్​గా ఉన్న జయరాం గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. దీంతో ఆయన టీడీపీలోకి చేరుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని జయరాం ఆవేదన వ్యక్తం చేశారు. తను ఏ తప్పు చేయకపోయినా కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్​లో హత్యాయత్నం కేసు నమోదు చేశారని మండిపడ్డారు. 

దీనిపై పోలీసులు ఎదువంటి విచారణ చేయకుండానే తనపై FIR నమోదు చేశారని వాపోయాడు. పార్టీకి దూరంగా ఉంటే అక్రమంగా కేసులు పెట్టాడం ఏంటని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. తన వార్డులో ఎలాంటి అభివృద్ధి జరగకపోవడంతోనే పార్టీకీ దూరంగా ఉన్నానని జయరాం తెలిపారు. తనపై విచారణ జరిపి అక్రమంగా పెట్టిన కేసులు ఎత్తివేయాలని పోలీసులను కోరారు. కార్పోరేటర్ జయరామ్​కు ఎమ్మార్పీఎస్ నాయకులు సంఘీభావం తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.