నిడదవోలులో ఉమ్మడి అభ్యర్థి కందుల దుర్గేశ్ ర్యాలీ - ఆలయాల్లో ప్రత్యేక పూజలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 12, 2024, 6:11 PM IST

thumbnail

MLA Candidate Kandula Durgesh Rally: తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థి కందుల దుర్గేశ్ (MLA Candidate Kandula Durgesh) ర్యాలీ నిర్వహించారు. టీడీపీ (TDP), జనసేన (Janasena) పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా దుర్గేశ్​ను అధిష్ఠానం ఎంపిక చేసింది. రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఎంపికైన తర్వాత నియోజవర్గంలో తొలిసారిగా ఆయన ప్రవేశించారు. దీంతో అభిమానులు, పార్టీ కార్యకర్తలు నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గేశ్​కు విజ్జేశ్వరం వద్ద మొదట ఘన స్వాగతం పలికారు. 

Janasena Kandula Durgesh in Byke Rally: అనంతరం ఆయన కనకదుర్గమ్మ అమ్మవారి గుడి (Kanaka Durgamma Temple)లో, స్థానిక శివాలయం (Lord Shiva Temple)లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి అభిమానుల బైక్ ర్యాలీ (Byke Rally)తో బయలుదేరి నిడదవోలు మండలం తిమ్మరాజుపురంలో వేంచేసిన కోట సత్తమ్మ అమ్మవారి ఆలయానికి (Kota Sattamma Temple) చేరుకుని పూజలు చేశారు. రాజమహేంద్రవరానికి చెందిన రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు, అభిమానులు ఈ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.