తోట త్రిమూర్తులుపై 28 ఏళ్లు పోరాడిన దళితులు మాకు స్ఫూర్తి: మహాసేన రాజేష్ - Mahasena Rajesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 17, 2024, 6:38 PM IST

thumbnail

Mahasena Rajesh reacts on Shiromundanam case: నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ జగన్ మాయ మాటలు చెబుతున్నారని, తెలుగుదేశం నేత రాజేష్ మహాసేన ధ్వజమెత్తారు. దళితులపై దాడులు చేసిన నేరస్తులను ప్రోత్సహిస్తూ, పక్కనే పెట్టుకున్న ఘనత సీఎం జగన్​కే దక్కుతుందని విమర్శించారు. తోట త్రిమూర్తులుపై 28 ఏళ్లు పోరాడిన దళితులు తమకు స్ఫూర్తి అని రాజేష్ కొనియాడారు. తోట త్రిమూర్తులును తక్షణమే వైసీపీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. 

ఎన్నికల్లో జగన్ సర్కారును దళితులంతా కలిసి ఓడించాలని రాజేష్ పిలుపునిచ్చారు. డాక్టర్ సుధాకర్ చావుకు కారణమైన వారిపై కేసులు పెట్టకపోవడం. ఎమ్మెల్సీ అనంత బాబు ను ప్రోత్సహించడం, కడప ఎంపీగా అవినాష్ రెడ్డికు మరలా టికెట్ ఇవ్వడం, ఇలా సీఎం నేరస్తులను వెనకేసుకు వస్తున్నారని ఆరోపించారు.  కోడికత్తి కేసులో దళిత యువకుడు శ్రీనివాస్ ఐదేళ్లపాటు జైలులో మగ్గిపోయాడని గుర్తుచేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో తరిమికొట్టాలని దళిత సమాజానికి రాజేష్ పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.