పోలీసులు పిన్నెల్లికి తక్కువ శిక్ష పడేలా చూస్తున్నారా!- సిట్​ రాకతో సీన్ మారిందా? - Lawyer Sunkara on Pinnelli Issue

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 22, 2024, 4:04 PM IST

thumbnail
పోలీసులు పిన్నెల్లికి తక్కువ శిక్ష పడేలా చూస్తున్నారా!- సిట్​ రాకతో సీన్ మారిందా? (ETV Bharat)

Lawyer Sunkara Rajendra Prasad on Pinnelli Issue : ఎన్నికల రోజు పాల్వాయిగేటులో ఈవీఎం ధ్వంసం ఘటనకు సంబంధించి అడుగడుగునా అధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం, వీవీప్యాట్‌ను ధ్వంసం చేసిన ఘటనలో ప్రిసైడింగ్‌ అధికారి నుంచి సీఈవో దాకా అన్ని స్థాయిల్లోని అధికారులు విఫలం చెందారన్న వాదన వ్యక్తమవుతోంది. పిన్నెల్లి చేసిన విధ్వంసానికి తగిన శిక్ష అమలు చేసే విషయంలోనూ పారదర్శకత లేదని పలువురు న్యాయవాదుల తెలుపుతున్నారు. 

ఎమ్మెల్యే  పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం ఘటనకు సంబంధించి పోలీసులు మొదట నమోదు చేసిన కేసులోని సెక్షన్లు తక్కువ శిక్ష పడేవిగా ఉన్నాయని సిట్‌ అధికారులు వెళ్లిన తర్వాతే కేసులో సెక్షన్లు మార్చారని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. ఈవీఎం ధ్వంసం కేసులో ఏ మేరకు శిక్షపడే అవకాశం ఉంటుందని చెబుతున్న హైకోర్టు సీనియర్‌ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్‌తో మా ప్రతినిధి జయప్రకాశ్‌ ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.