నరసరావుపేటలో స్థల వివాదం - వైఎస్సార్సీపీ నేతల మధ్య ఘర్షణ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 8, 2024, 5:43 PM IST

thumbnail

Land Dispute Between YSRCP Leaders : పల్నాడు జిల్లా నరసరావుపేటలో వైఎస్సార్సీపీ నేతల మధ్య వివాదం చోటు చేసుకుంది. స్థలం విషయంలో ఇద్దరు నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో 18వ వార్డు వైఎస్సార్సీపీ ఇన్​ఛార్జి బొగ్గరం మూర్తిపై మరో వైఎస్సార్సీపీ నేత వెంకటరెడ్డి అలియాస్ మిలటరీ రెడ్డి భౌతిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం కత్తితో దాడి చేసేందుకు యత్నించారు. స్థానికులు సమాచారం అందించటంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వెంకటరెడ్డి నుంచి కత్తి స్వాధీనం చేసుకుని ఒకటో పట్టణ పోలీసు స్టేషన్​కు తరలించారు. 

Venkata Reddy Attempt to Attack With Knife on Boggaram Murthy: జిల్లాలోని నరసరావుపేట 19 వార్డు సచివాలయం వద్ద ఆక్రమణ తొలగించే విషయంలో ఇద్దరు వైసీపీ నేతల మధ్య వివాదం తలెత్తింది. 18వ వార్డు వైఎస్సార్సీపీ ఇన్​ఛార్జి బొగ్గరం మూర్తి స్థానికులతో స్పందనలో ఫిర్యాదు చేయించాడని అతనిపై వెంకటరెడ్డి దాడికి పాల్పడ్డాడు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.