కోమటిరెడ్డి వర్సెస్ హరీశ్​రావు- 'కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాకే నల్గొండ రావాలి'

By ETV Bharat Telangana Desk

Published : Feb 12, 2024, 3:16 PM IST

thumbnail

Minister Komati Reddy Vs Harish Rao in Assembly : శాసనసభలో కృష్ణాజలాల అంశంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మంత్రి ఉత్తమ్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ తర్వాత మాట్లాడిన హరీశ్‌రావు సభలో చేసిన తీర్మానం బీఆర్ఎస్ విజయంగా పేర్కొన్నారు. రేపు నల్గొండలో కేసీఆర్‌ సభ ఉన్నందునే ప్రభుత్వం ముందుగా స్పందించి కృష్ణా జలాల అంశంపై తీర్మానం చేసిందని హరీశ్‌రావు పేర్కొన్నారు. 

హరీశ్‌పై ఎదురుదాడి చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కేసీఆర్‌ సర్కార్‌ నల్గొండ జిల్లాను నాశనం చేసిందని మండిపడ్డారు. జగన్ వీడియో చూపించాక కూడా ఇంకా మాట్లాడేది ఏముందని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో హరీశ్ రావుకు పెట్రోల్ దొరికింది కానీ అగ్గిపెట్ట దొరకలేదని అన్నారు. నల్గొండ ప్రజలకు క్షమాపణ చెప్పాకే కేసీఆర్‌ అక్కడకు రావాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో సభలో కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ సభ్యుల డిమాండ్‌తో మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగిస్తున్నట్లు సభాపతి తెలిపారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.