నాసిరకం మందుల వల్లే పిల్లలకు అస్వస్థత: కొల్లు రవీంద్ర

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 10, 2024, 3:40 PM IST

thumbnail

Kollu  Ravindra Criticized YCP Government : జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు వికటించి ఏడుగురు పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. ప్రైవేట్‌ సంస్థల నుంచి కొనుగోలు చేసిన నాసిరకం మందులు వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని దుయ్యబట్టారు. మందులు పంపిణీ చేసిన సాయి ఫార్మా సంస్థని వెంటనే బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్‌ చేశారు. కమీషన్‌లకు కక్కుర్తిపడి జగన్ ప్రభుత్వం నాసిరకం మందులను పంపిణీ చేస్తోందని ఆరోపించారు.  

Antibiotic Injection to Childrens : కరోనా టైంలో కూడా వైసీపీ నాయకులు బ్లాక్‌లో ఆక్సిజన్ సిలిండర్లు అమ్ముకోవడం వల్లే ఆక్సిజన్ కొరతతో అనేకమంది ప్రాణాలు కోల్పోయారని విమర్శించారు. ప్రజల ప్రాణాలంటే జగన్ ప్రభుత్వానికి లేక్కలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్లు సరైన సమయంలో స్పందించడంవల్ల పిల్లల ప్రాణాలను కాపాడగలిగారని తెలిపారు. వైద్యులు మాట్లాడుతూ, చిన్నారులకు రోజూ మాదిరిగానే శుక్రవారం రాత్రి ఇంజక్షన్ చేశామని తెలిపారు. అయితే ఇంక్షన్ చేసిన అరగంట తర్వాత పిల్లలకు విపరీతమైన చలి, జర్వం వచ్చిందని వివరించారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.