జగన్​ పాలనపై ప్రజలు విసిగిపోయారు- ఈసారి కడపను కైవసం చేసుకుంటాం- భూపేశ్ రెడ్డి - TDP Leader Bhupesh Reddy Interview

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 7, 2024, 5:32 PM IST

thumbnail
జగన్​ పాలనపై ప్రజలు విసిగిపోయారు- ఈసారి కడపను కైవసం చేసుకుంటాం- భూపేశ్ రెడ్డి (ETV Bharat)

Kadapa TDP MP Candidate Bhupesh Reddy Interview: వై.ఎస్. కుటుంబానికి కంచుకోటగా ఉన్న కడప పార్లమెంటును ఈసారి తప్పకుండా కైవసం చేసుకుంటామని కడప నియోజకవర్గం కూటమి ఎంపీ అభ్యర్థి చదిపిరాళ్ల భూపేశ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించిన భూపేష్ రెడ్డి పార్లమెంటు పరిధిలో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మూడున్నర దశాబ్ధాలుగా వై.ఎస్.కుటుంబ సభ్యులే కడప ఎంపీలుగా ఉన్నా జిల్లా ప్రజలకు ఒరిగిందేమి లేదన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనంతా అవినీతేనని భూపేష్‌ రెడ్డి  అన్నారు. విపక్షాలపై విమర్శలు తప్ప అభివృద్ధిలేదని ఆయన విమర్శించారు.

రాష్ట్రంలో రౌడీ రాజ్యాన్ని సీఎం జగన్‌ కొనసాగించారని భూపేశ్ రెడ్డి మండిపడ్డారు. కుటుంబ వివాదాలతో వైఎస్ కుటుంబ సభ్యుల మాటలను జిల్లా ప్రజలు చీదరించుకుంటున్నారని భూపేశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. కనీసం కడప స్టీల్ ప్లాంట్​ను సైతం పూర్తి చేయలేకపోయారని ఆయన విమర్శించారు. జగన్ చేసిన ఐదు సంవత్సరాల పాలనపై ప్రజలు విసిగిపోయారని ఆయన అన్నారు. అందుచేత ప్రజలు చంద్రబాబు పాలన కోసం ఎదురుచూస్తున్నారని భూపేశ్ రెడ్డి పేర్కొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.