'గోదావరి ఎత్తిపోతల పథకాలన్నీ నిర్వీర్యం- రైతులకు నష్టాల్లోకి నెట్టిన జగన్​ ప్రభుత్వం' - Jyothula Nehru Interview Jaggampeta

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 4, 2024, 1:13 PM IST

thumbnail
'గోదావరి ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వం నిర్వీర్యం చేసి రైతులకు నష్టాల్లోకి నెట్టింది'(ETV BHARAT)

Jyothula Nehru Interview Jaggampeta : జగన్ పాలనలో ప్రజలు అనేక సమస్యలతో సతమతమయ్యారని వైఎస్సార్సీపీని ఎన్నికల్లో ఓడించేందుకు సిద్ధమయ్యారని కాకినాడ జిల్లా జగ్గంపేట తెలుగుదేశం అభ్యర్థి జ్యోతుల నెహ్రూ అన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో గోదావరి ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వం నిర్వీర్యం చేయడంతో తీవ్ర సాగునీటి ఎద్దడి తలెత్తి వేల ఎకరాల్లో రైతులకు తీవ్రనష్టం వాటిల్లిందని వివరించారు. యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని చెప్పారు. నిరుద్యోగం, విద్య, వైద్యం, నీరు ఈ నాలుగు సమస్యలతో జగ్గంపేట ప్రజలు సతమతమవుతున్నారని జ్యోతుల నెహ్రూ అన్నారు. 

సామాన్యుడికి అందుబాటులో విద్యను అందించడం నా లక్ష్యం అని ఆయన అన్నారు. అదేవిధంగా సుదూరాన ఉన్న వైద్య సేవలు పేద ప్రజలకు అందిస్తానని హామీ ఇచ్చారు. నిరుద్యోగుల అంశం సహా స్థానిక సమస్యల గురించి ఇప్పటికే చంద్రబాబుతో చర్చించానని అన్నింటినీ పరిష్కరించి అభివృద్ది కోసం పాటుపడతానని జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేస్తున్న జ్యోతుల నెహ్రూతో మా ప్రతినిధి సాయికృష్ణ ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.