LIVE: పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ రోడ్ షో - ప్రత్యక్ష ప్రసారం - pawan kalyan road show pithapuram
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 10, 2024, 3:03 PM IST
|Updated : May 10, 2024, 6:35 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-05-2024/640-480-21432133-thumbnail-16x9-pawan-kalyan-road-show-in-pithapuram.jpg)
Pawan Kalyan Road Show in Pithapuram: ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేనాని పవన్ కల్యాణ్ తన జోరు పెంచారు. వైఎస్సార్సీపీ, జగన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. గురువారం విజయవాడలో నిర్వహించిన వారాహి విజయయాత్రలో పవన్ పాల్గొన్నారు. రాష్ట్రంలో 30 వేలమంది మహిళలు అదృశ్యమయ్యారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. జగన్ ఇంటికి కూతవేటు దూరంలో యువతిపై లైంగికదాడి జరిగితే నిందితులను ఇంకా పట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనార్టీల అభ్యున్నతికి కూటమి మేనిఫెస్టో తోడ్పడుతుందని పవన్ హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని ప్రశ్నించారు. ప్రస్తుతం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ రోడ్ షో నిర్వహిస్తున్నారు. చిత్రాడ నుంచి పవన్ రోడ్ షో ప్రారంభం అయింది. పిఠాపురం, గొల్లప్రోలు, చేబ్రోలు, దుర్గాడలో పవన్‌కల్యాణ్ రోడ్ షో సాగనుంది. సాయంత్రం నుంచి ఉప్పాడ కొత్తపల్లి మండలంలో పవన్‌కల్యాణ్ రోడ్ షో జరగనుంది. ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న పవన్ రోడ్ షో ప్రత్యక్ష ప్రసారం.