తిరుపతిలో జనసేన జెండా ఎగరవేయబోతున్నాం- కూటమి పార్టీల నేతలతో పవన్ భేటీ : నాగబాబు - Nagababu Meet NDA Alliance Leaders

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 13, 2024, 4:08 PM IST

thumbnail

Janasena Leader Nagababu Meet NDA Alliance Leaders : జనసేన గెలుపు కోసం తిరుపతిలో కూటమి నేతలతో చర్చించి అందరిని ఒక తాటిపైకి తీసుకొచ్చామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు తెలిపారు. జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులును గెలిపించాలని కోరారు. తిరుపతిలోని ఓ హోటల్​లో కూటమి నేతలతో రెండు రోజులు పాటు పవన్‍ కల్యాణ్‍ (Pawan Kalyan) సమావేశమై చర్చించారని నాగబాబు తెలియజేశారు. శుక్రవారం రాత్రి టీడీపీ, జనసేన నాయకులతో సమావేశం నిర్వహించిన పవన్‍ కల్యాణ్‍ ఇవాళ ఉదయం బీజేపీ నేతలతో సమావేశమయ్యారన్నారు. కూటమి నేతల సమన్వయంతో తిరుపతిలో జనసేన జెండా ఎగరడం ఖాయమని నాగబాబు తెలిపారు.

తిరుపతిలో తప్పక గెలుస్తామనే ఉద్దేశంతోనే తాను, చంద్రబాబు కలిసి జనసేన అభ్యర్థిని నిలబెట్టామని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తెలిపారు. కూటమి నేతలందరూ కలిసికట్టుగా పనిచేసి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులును గెలిపించాలని కోరారు. శుక్రవారం సాయంత్రం ఆయన తిరుపతికి వచ్చి కూటమి నేతలతో సమావేశమయ్యారు. కూటమి పొత్తుకు దారి తీసిన పరిస్థితులను నేతలకు వివరించారు. తిరుపతిలో జరుగుతున్న అక్రమాలు ప్రతి ఒక్కరికీ తెలుసని, తిరుమల కొండకు వెళ్లే పరిస్థితి లేదని, వైసీపీ అభ్యర్థి భూమన అభినయ్‌రెడ్డి గెలిస్తే తిరుపతిలో ఉండలేని పరిస్థితి తలెత్తుతుందన్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత పనిచేసిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేసే బాధ్యత తాము తీసుకుంటామన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.