ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనే 'జై భారత్' ధ్యేయం: జేడీ లక్ష్మీనారాయణ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 28, 2024, 7:04 PM IST

thumbnail

Jai Bharath Party Chief VV Lakshmi Narayana Fires on CM Jagan : ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా (Special Category Status) తీసుకు వస్తామని చెప్పిన జగన్, అధికారంలోకి వచ్చిన తరువాత స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని మాజీ సీబీఐ జేడీ, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు వీవీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. 25 ఎంపీలను గెలిపించినా రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలను సాధించుకోవడంలో తీవ్రంగా విఫలం అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలో ఓ ప్రైవేటు పంక్షన్ హాల్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అనంతరం జై భారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టో ఆయన విడుదల చేశారు. ప్రతి జిల్లాలో కూడా మేనిఫెస్టో విడుదల కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. 

అప్పు, అవినీతి, డగ్లస్, రౌడీయిజం, పర్యావరణ విధ్వంసం లేని ఆంధ్రప్రదేశ్ చేస్తామని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. అన్ని పార్టీలు ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని అంటున్నాయని, కానీ ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనే తమ ధ్యేయమని ఆయన తెలిపారు. ఒకటో తేదీన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చలో తాడేపల్లి ప్యాలస్ పేరిట కార్యక్రమం నిర్వహిస్తున్నారని, దానికి తమ పార్టీ మద్దతు ఉంటుందని తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.