'వైఎస్సార్సీపీ అరాచకాలను అంతమొందిచాలన్నదే లక్ష్యం- కూటమికి స్వతంత్ర అభ్యర్థి మద్దతు - Vadde Sirisha Support to Alliance

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 8, 2024, 2:52 PM IST

thumbnail
'వైఎస్సార్సీపీ అరాచకాలను అంతమొందిచాలన్నదే లక్ష్యం- కూటమికి స్వతంత్ర అభ్యర్థి మద్దతు (ETV Bharat)

Independent Candidate Vadde Sirisha Support to Alliance in Visakhapatnam : విశాఖలో కూటమికి మద్దతు ఇస్తున్నట్లు స్వతంత్ర అభ్యర్థి వడ్డే శిరీష ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియలో ఈసీ తనకు గాజు గ్లాసు గుర్తు కేటాయించిందని తెలిపారు. వైఎస్సార్సీపీ అరాచకాలను అంతమెుందించాలంటే కూటమి గెలుపు తప్పనిసరి అని ఆమె పేర్కొన్నారు. కూటమి మ్యానిఫెస్టోలో మహిళలకు పెద్దపీట వేశారని, అది తనకెంతో నచ్చిందని శిరీష తెలిపారు. ఓటర్లకు గుర్తుల పట్ల గందరగోళం ఏర్పడి తన వల్ల జనసేన ఓట్లకు నష్టం కలగకూడదని ఆమె చెప్పారు. 

"నాకు గాజు గ్లాసు గుర్తు ఇవ్వడం వల్ల ఓటర్లు గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉంది. విత్​డ్రా అవకాశం లేని కారణంగా మీడియా ముఖంగా నా మద్దతు కూటమికే అని తెలుపుతున్నాను. రానున్న కాలంలో మంచి నేత అధికారంలోకి రావాలని నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను" అని శిరీష పేర్కొన్నారు. కూటమి మ్యానిఫెస్టోకి ఆకర్షితులై కూటమి గెలుపునకు కృషి చేస్తా అంటున్న స్వతంత్ర అభ్యర్థి వడ్డే శిరీషతో ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.