పత్తి మాటున 'టేకు' అక్రమ రవాణా - 7 దుంగల విలువ అక్షరాలా రూ.3 లక్షలు

By ETV Bharat Telangana Team

Published : Feb 4, 2024, 2:09 PM IST

thumbnail

Illegal Transportation of Teak Wood In Bhadradri : పత్తి వాహనంలో అక్రమంగా టేకు కలపను తరలిస్తున్న ముఠాను భద్రాద్రి కొత్తగూడెం అటవీ అధికారులు పట్టుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రతి రోజు పత్తి వాహనాలు వెళ్తాయి. దీన్నే అసరాగా తీసుకున్నారు నిందితులు. అటవీ అధికారులకు అనుమానం రాకుండా పత్తి వాహనంలో టేకు కలపను పెట్టి, దాని పైనుంచి పత్తి బస్తాలను వేసి బయల్దేరారు. 

దుమ్నుగూడెం వైపు నుంచి భద్రాద్రి మీదుగా బ్రిడ్జి దాటి వెళుతున్న క్రమంలో అటవీ శాఖ సిబ్బందికి అనుమానం వచ్చి పరిశీలించగా, అడుగు భాగంలో టేకు కలప లభ్యమైంది. 7 కలప దిమ్మల విలువ సుమారు రూ.3 లక్షలు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కలప రవాణా చేస్తున్న ఒక వ్యక్తితో పాటు బొలేరో వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా టేకు కలప రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.