కమలానికి ఓటు వేస్తే పది కాలాల పాటు రాష్ట్రం పదిలం : స్వామీ పరిపూర్ణానంద

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 29, 2024, 1:15 PM IST

thumbnail

Hindu Sangam Program in Rajamahendravaram : దేశం సుభిక్షంగా ఉండాలంటే రామ రాజ్యం అవసరమని, అది కమల వికాసంతోనే సాధ్యమని శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ కళాశాల మైదానంలో శ్రీరామ ఉత్సవ కమీటీ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన భారీ హిందూ సంగమం కార్యక్రమానికి ధర్మజాగరణ అఖిల భారతి సహ సంయోజక్​ ఆలే శ్యామ్​జీతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

గుడి కొట్టేవారికి కాకుండా కట్టేవారికి ఓటు వేయాలని స్వామి పరిపూర్ణానంద ప్రజలకు సూచించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాషాయ జెండా ఎగుర వేయాలని కోరారు. బీజేపీకి ఓటు వేస్తే పది కాలాలు పువ్వుల్లో పెట్టి చూసుకుంటారని, మీ బిడ్డ భవితకు భరోసా ఇచ్చినవారవుతారని తెలిపారు. హిందూ సమాజం బలంగా ఉంటేనే భారతదేశం సుస్థిరంగా ఉంటుందని, అందుకు అంతా సంఘటితంగా ఉండాలని ఆలే శ్యామ్​జీ సూచించారు. హిందూ సంగమం కార్యక్రమంలో కళాకారుల ప్రదర్శనలు చూపరులను అలరించాయి. ఈ కార్యక్రమానికి జనం భారీగా తరలివచ్చారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.