పీడీఎంఎస్​తో 46,389 పోలింగ్ కేంద్రాలలపై నిఘా-రాష్ట్ర ఎన్నికల అదనపు ప్రధానాధికారి - Poll Day Management System

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 12, 2024, 5:45 PM IST

thumbnail
పోలింగ్ కేంద్రాల్లో జరిగే ప్రతీ అంశాన్నీ పర్యవేక్షిస్తాం: ఎన్నికల అదనపు ప్రధానాధికారి (ETV Bharat)

Poll Day Management System: పోల్ డే మేనేజ్మెంట్ సిస్టం ద్వారా 46,389 పోలింగ్ కేంద్రాల్లో జరిగే ప్రతీ అంశాన్నీ పర్యవేక్షిస్తామని రాష్ట్ర ఎన్నికల అదనపు ప్రధానాధికారి హరేంథిర ప్రసాద్ స్పష్టం చేశారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో లోపలా బయటా వెబ్ క్యాస్టింగ్ తో పాటు ఈవీఎంలు, సిబ్బంది, మాక్ పోలింగ్, ఏజెంట్లు ఇలా వివిధ అంశాల్ని ఈ పోల్ డే మేనేజ్మెంట్ సిస్టం వెబ్ అప్లికేషన్ ద్వారా పర్యవేక్షిస్తామన్నారు. పోలింగ్ స్టేషన్ కు సిబ్బంది చేరిక నుంచి ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్ కు తరలించేంత వరకూ అన్ని అంశాలనూ ఈ వ్యవస్థ పర్యవేక్షణ చేస్తుందని అడిషనల్ సీఈఓ ఈటీవీకి వెల్లడించారు.  ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.  ఎలాంటి హింస జరగకూడదని ఎస్పీలను ఆదేశించినట్లు పేర్కొన్నారు.  20 శాతం మేర అదనంగా ఈవీఎంలు వచ్చాయన్నారు.  సాంకేతిక సమస్యలు వస్తే వెంటనే సరిచేసేలా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.  గతంకంటే ఎక్కువగా పోస్టల్ బ్యాలెట్ వినియోగం జరిగిందని హరేంథిర ప్రసాద్ స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.