ఈసీ వేటుతో బదిలీ అయిన ఐఏఎస్​లకు పోస్టింగ్‌లు - Postings to IAS in AP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 8, 2024, 10:21 PM IST

thumbnail

Government Orders Giving Postings to IAS Officers in AP: రాష్ట్రంలో కొందరు ఐఏఎస్​లకు పోస్టింగులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం వేటుతో బదిలీ అయిన వారికి పోస్టింగులు ఇచ్చారు. ఈసి ఆదేశాల మేరకు ఎన్నికలతో సంబంధం లేని శాఖలకు పోస్టింగులు ఇచ్చారు. ఆరోగ్య శ్రీ ట్రస్టు సీఈఓగా లక్ష్మీషా, స్కిల్ డెవలప్​మెంట్ కార్పోరేషన్ ఎండీగా రాజాబాబు, టీటీడీ జేఈవోగా గౌతమి, మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్​గా అంబేద్కర్, పౌరసరఫరాల కార్పోరేషన్ ఎండీగా వెంకట్రామి రెడ్డి, సీసీఎల్ఏ కార్యదర్శిగా ప్రభాకర్ రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

CEC Transferred IAS and IPS Officers: వైఎస్సార్సీపీ నాయకులే చెప్పిందే చట్టంగా సాగిస్తున్న 9 మంది అధికారులపై ఇటీవల ఎన్నికల కమీషన్ వేటు వేసింది. ఎన్నికల కోడ్‌ని సైతం లెక్కచేయకుండా వైఎస్సార్సీపీకు వంతపాడుతున్న ముగ్గురు కలెక్టర్లు, అయిదుగురు ఎస్పీలతో పాటు ఐజీని బదిలీ చేసింది. ప్రతిపక్షాల ఫిర్యాదులు, సీఈవో నివేదికలతో వైఎస్సార్సీపీకు బంటుల్లా పని చేస్తున్న వారిని పక్కకు పెట్టింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.