టీడీపీ ఫ్లెక్సీలను చింపివేసిన గుర్తుతెలియని వ్యక్తులు - ఆగ్రహం వ్యక్తం చేసిన నేతలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 10, 2024, 7:59 PM IST

thumbnail

Flexi Dispute In Nandyala District : నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన 'బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ' ఫ్లెక్సీలను దుండగులు శుక్రవారం రాత్రి చించివేయడంతో నగరంలో కలకలం రేపింది. దీంతో డోన్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై టీడీపీ నాయకులతో కలిసి డోన్ పట్టణ స్టేషన్​లో సీఐ ప్రవీణ్ కుమార్​కు ఫిర్యాదు చేశారు. ఫ్లెక్సీలు చించేసిన వారిని పట్టుకొని వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. 

Flexi Problem in Dhone : అయితే గతనెల 23న కూడా కొందరూ దుండగులు ఇదేవిధంగా టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్లీలను చింపారని తెలిపారు. ఇవన్నీ ఎవరూ చేస్తున్నారు, ఇతర పార్టీల ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేయాలని సీఐను కోరారు. అనంతరం సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ఫ్లెక్సీలు చించినంత మాత్రాన ప్రజల గుండెలో ఉన్న నన్ను చేరపలేరని తెలిపారు. ఇలాంటి తప్పుడు పనులకు పాల్పడిన వారు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.