విద్యుత్ వైర్లు తగిలి లారీ దగ్ధం- అప్రమత్తమైన డ్రైవర్​ - Fire Accident in Lorry in Kurnool

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 30, 2024, 1:04 PM IST

thumbnail

Fire Accident in Lorry in Kurnool District : కర్నూలు జిల్లా ఆదోని బైపాస్ నిర్మాణ పనుల్లో పెను  ప్రమాదం తప్పింది. ఉదయం ధనపురం నుంచి ఆదోని బైపాస్ రాహదారి నిర్మాణానికి మట్టిని తరలిస్తుండగా అకస్మాత్తుగా టిప్పర్​కు విద్యుత్ వైర్లు (Electric Wires) తగిలి మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ (Driver) వెంటనే టిప్పర్ నుంచి దూకి ప్రాణాలతో బయట పడ్డాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది (Fire fighters) ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు. ఈ ఘటనతో డ్రైవర్​ భయాందోళనకు గురయ్యాడు. 

Lorry Fire Accident  Due to Electric Wires at Adoni : రాష్ట్రంలో రోజు రోజుకు ఇటువంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇటీవలె ఎన్టీఆర్ జిల్లా (NTR District) మైలవరం మండలం వెల్వడంలో విద్యుత్తు తీగలు లారీ ట్రక్కుకు తగిలి విద్యుదాఘాతంతో డ్రైవర్ మృతి చెందిన ఘటన జరిగింది. ఈ ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.