హన్మకొండ జిల్లాలో దారుణం- పత్తిపంటను రక్షించబోయి మహిళ దగ్ధం

By ETV Bharat Telangana Team

Published : Feb 9, 2024, 3:34 PM IST

thumbnail

Fire Accident in Hanmakonda : హన్మకొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో నిలువచేసిన పత్తి దిగుబడిని కాపాడుకోబోయి ఓ మహిళ సజీవ దహనమయ్యింది. హన్మకొండ జిల్లా కమలాపూర్‌ మండలం మర్రిపల్లిగూడెంకు చెందిన తొడేటి సౌందర్య(56) అనే మహిళ మంటలను ఆర్పాలని ప్రయత్నించబోయి సజీవ దహనమైంది. వీరిది వ్యవసాయాధారిత కుటుంబం. గత వానకాలం సీజన్​లో పత్తి పంటను సాగు చేశారు. ప్రస్తుతం మార్కెట్​లో గిట్టుబాటు ధర లేకపోవటంతో వచ్చిన పత్తి దిగుబడికి ఇంట్లో నిలువ చేశారు. ప్రమాదవశాత్తు ఇంట్లో షార్ట్ సర్క్యూట్​తో పత్తికి మంటలు వ్యాపించాయి. 

అగ్నిప్రమాదాన్ని గుర్తించిన సదరు మహిళ మంటలను ఆర్పే ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నంలో పత్తి సంచులు ఆమె మీద పడి మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. దీంతో ఆమె అక్కడికక్కడే సజీవ దహనమయ్యింది. ఇది గమనించిన స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అప్పటికే ఆ మంటల్లో సౌందరయ్య సజీవ దహనమయ్యింది. మృతురాలి కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.