సచివాలయంలో కొట్టుకున్న వాలంటీరు, ఉద్యోగి- సామాజిక మాధ్యమాల్లో వైరల్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 11, 2024, 10:37 PM IST

Updated : Mar 12, 2024, 1:25 PM IST

thumbnail

Fight Between Volunteer and Secretariat Employee: విధుల్లో ఉన్న సచివాలయ ఉద్యోగి, వాలంటీర్ కార్యాలయంలోనే ఒకరిపై ఒకరు పరస్పర దాడి చేసుకున్న ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటన జరిగి నాలుగు రోజులు కాగా ఆలస్యంగా విషయం బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని రాయచోటి పరిధిలోని కొత్తపల్లి సచివాలయంలో వాలంటీర్ సాదిక్​ భాషా అడ్మిన్​ నందకుమార్​ను తన రెషన్​ కార్డును వేరు చేయాలని రెండు నెలలుగా అడుగుతున్నా పట్టించుకోవడం లేదని తీవ్ర స్వరంతో అడగడంతో ఇద్దరి మధ్య మాటలు పెరిగి తీవ్ర పదజాలంతో దూషిస్తూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. 

నాలుగు రోజులు క్రితం ఈ ఘటన జరగగా విషయం బయటకు రాకుండా అధికారులు జాగ్రత్త పడ్డారు. అయితే ఈ దాడికి సంబంధించిన వీడియోలు సామాజిక మద్యమాలలో వైరల్ కావడంతో విషయం వెలుగు చూసింది. వాలంటీర్​, అడ్మిన్​లను నిలువరించేందుకు సిబ్బంది చేసిన ప్రయత్నం విఫలం కావడంతో సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వాలంటీర్​ను, నందకుమార్​ను స్టేషన్​కి తీసుకెళ్లి విచారించారు. వాలంటీర్​కు గాయాలు కావడంతో పోలీసులు నందకుమార్​పై కేసు నమోదు చేశారు. సచివాలయంలోనే వాలంటీర్, అడ్మిన్ ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో పురపాలక అధికారులు విచారణ చేపట్టి అడ్మిన్​పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

Last Updated : Mar 12, 2024, 1:25 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.