నకిలీ విత్తనాలతో 1000 ఎకరాల్లో పంట నష్టం- పరిహారం ఇవ్వాలంటూ రైతుల ఆందోళన

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 6, 2024, 1:26 PM IST

thumbnail

Farmers Lost Their Crops Due to Sale of Fake Seeds: వ్యవసాయం ఆధునీకరణ జరుగుతున్నా నకిలీ విత్తనాల జాడ్యం మాత్రం వదలడం లేదు. స్వయంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నియోజకవర్గమైన నెల్లూరులో నకిలీ విత్తనాలు కొని రైతులు తీవ్రంగా నష్టపోయారు. నకిలీ విత్తనాల సాగుతో సుమారు 1000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అసలైన విత్తనాలు అనుకొని నమ్మి సాగు చేసి తీవ్రంగా నష్టపోయామని రైతులు తెలిపారు. నకిలీ విత్తనాలు విక్రయించిన సంస్థపై వ్యవసాయశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పరిహారం చెల్లించాలని వ్యవసాయశాఖ కార్యాలయం వద్ద బాధిత రైతులు నిరసన చేపట్టారు.

రెండు సంవత్సరాలుగా నకిలీ వరి విత్తనాలతో వ్యాపారులు మోసం చేస్తున్నారని రైతులు పేర్కొన్నారు. విడవలూరు, కొడవలూరు, బుచ్చిరెడ్డిపాలెం మండలాల్లోనూ కావేరి సీడ్స్ పేరుతో దాదాపు 582బస్తాల నకిలీ విత్తనాలను వ్యాపారులు సరఫరా చెేసినట్లు రైతులు తెలిపారు. ఎకరానికి 35వేల వరకు పెట్టుబడి పెట్టి నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమా లేక సీడ్స్ కంపెనీ చెల్లిస్తదో మాకు తెలియదు కచ్చితంగా పరిహారం మాత్రం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.