LIVE: జగన్ పాలనపై బీసీలు ఏం అంటున్నారు - జీవితాల్లో వెలుగులు నింపారా? - Debate on BC Welfare

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 9, 2024, 9:29 AM IST

Updated : May 9, 2024, 10:57 AM IST

thumbnail

Debate on BC Welfare: జనాభాలో సగానికి పైగా బీసీలు ఉన్నారు. 140 పైగా బీసీ కులాలు ఉన్నాయి. సీఎం అవకముందు జగన్ వారికి ఏవేం వాగ్దానాలు చేశారు? ఐదేళ్లలో ఏం నెరవేర్చారు? దామాషా ప్రకారం పదవుల్లో వాటా ఇచ్చారా? స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు అదనంగా ఏవన్నా ఇచ్చారా? వైసీపీ పాలనలో ఎంతమంది బీసీలపై దాడులు జరిగాయి? బీసీలను పీడించిన దోషులకు ఎలాంటి శిక్షలు విధించారు? ఐదేళ్లలో 75 వేల కోట్లు ఖర్చు చేస్తామన్న బీసీ సబ్‌ప్లాన్ సంగతేంటి? బీసీ సబ్‌ప్లాన్ కింద ఏటా 15 వేల కోట్లకు తక్కువ కాకుండా ఐదేళ్లలో 75 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తామని, చేయూత ద్వారా నాలుగు విడతల్లో ఒక్కో బీసీ మహిళకు 75వేల రూపాయల చొప్పున ఆర్థికసాయం చేస్తామని జగన్‌ మాటిచ్చారు. వీటి అమలు సంగతి ఏమైంది? చేతివృత్తిదారుల జీవితాల్లో వెలుగులు నింపారా? బీసీ కులవృత్తుల వారు జగన్‌ పాలనపై ఏం అంటున్నారు? ఎన్నికల్లో ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు? కూటమి ఎన్నికల మ్యానిఫేస్టో - వైసీపీ మ్యానిఫేస్టో రెండూ చూశాక, బీసీలకు మేలు ఎవరి వల్ల జరుగుతుంది? ఇదీ మన డిబేట్.

Last Updated : May 9, 2024, 10:57 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.