తిరుమలలో ఏనుగుల గుంపు హల్​చల్- వీడియో వైరల్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 11, 2024, 12:24 PM IST

thumbnail

Elephants Herd Made Hal Chal in Tirumala: తిరుమలలో ఏనుగుల గుంపు హల్ చల్ చేసింది. ఆదివారం తెల్లవారుజామున పార్వేట మండపం వద్ద సంచరించిన ఏనుగుల గుంపు ఒక్కసారిగా అక్కడున్న ఇనుప కంచెను, చెట్లను నేల కూల్చి రోడ్డుపైకి వచ్చి వెళ్లాయి. ఏనుగులు రోడ్డుపైకి రావడంతో దర్శనానికి వచ్చిన భక్తులు కంగారు పడ్డారు. సమాచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు (Forest officials) ఘటన స్థలాన్ని పరిశీలించి తిరిగి అవి రోడ్డుపైకి రాకుండా రక్షణ చర్యలు చేపట్టారు. ప్రతి సంవత్సరం పార్వేట మండపం పరిసర ప్రాంతాల్లో ఇదే నెలలో ఏనుగులు సంచరిస్తున్నాయని అక్కడి అధికారులు తెలిపారు. ఏనుగుల సంచారంతో అప్రమత్తమైన టీటీడీ (TTD), విజిలెన్స్ అధికారులు ఆ మార్గంలో వెళ్లే వాహనదారులు, నడకదారి భక్తులకు జాగ్రత్తగా వెళ్లాలని సూచిస్తున్నారు.

గతంలో ఎలుగుబంటి, పులి ఇక్కడ సంచరించడంతో తిరుమల నడకదారిలో వచ్చే భక్తులు భయబ్రాంతులకు గురయ్యారు. అటవీ శాఖ అధికారులు భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఏనుగుల గుంపు (elephants herd) రోడ్లపైకి రావడంతో వాహనదారులతోపాటు నడకదారి భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. దర్శనానికి వచ్చే వారికి ఎటువంటి అపాయం జరగకుండా టీటీడీ అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.