డ్రగ్స్​ ఒక్కసారి వినియోగిస్తే బానిసలుగా మారే అవకాశం : సందీప్ శాండిల్య

By ETV Bharat Telangana Desk

Published : Feb 10, 2024, 2:04 PM IST

thumbnail

Drugs Awareness Program in Shamirpet : మత్తు పదార్థాలు ఒక్కసారి వినియోగిస్తే బానిసలుగా మార్చేస్తాయని, వాటికి దూరంగా ఉండాలని మాదకద్రవ్యాల నిరోధక విభాగం డైరెక్టర్ సందీప్ శాండిల్య అన్నారు. హైదరాబాద్‌ షామీర్​పేట్​లోని బిట్స్ పిలానీలో మాదకద్రవ్యాల నిర్మూలనపై నిర్వహించిన ఉన్నత స్థాయి సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మాదకద్రవ్యాలు విక్రయించే వారితో పాటు, ఉపయోగించే వారి గురించి పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. 

రాష్ట్రప్రభుత్వం మాదకద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపిందని, రాష్ట్రంలో డ్రగ్స్​ నిర్మూలనకు తనిఖీలను ముమ్మరం చేశామన్నారు. మాదకద్రవ్యాలను సరఫరా చేసేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొత్త ఏడాదిలో ఒక్కరు కూడా మాదకద్రవ్యాల బారిన పడకుండా ఉండేందుకు 90 పబ్బులను తనిఖీలు చేశామన్నారు. డ్రగ్స్‌ను నిర్మూలించేందుకు పోలీసులకు సహకరించాలని విద్యార్థులను కోరారు. ఈ సదస్సులో రాచకొండ సీపీ సుధీర్ బాబు యూఎస్ కౌన్సిలేట్ అధికారి ఎర్న్ ఫిషర్, సైబరాబాద్ సీపీ అవినాశ్​ మహంతి తదితరులు పాల్గొన్నారు .

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.