చుక్కల భూములపై వైఎస్సార్సీపీ నేతల కన్ను

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 13, 2024, 12:31 PM IST

thumbnail

Dotted Lands Into Fishing Ponds In Bapatla District : బాపట్ల జిల్లా అద్దంకి మండలం శింగరకొండ పాలెంలో  చుక్కల భూమిలో వైఎస్సార్సీపీ నాయకుడు చేపల చెరువు తవ్వుతున్నారు.  స్థానికుల ద్వారా తెలుసుకున్న రెవెన్యూ సిబ్బంది అభ్యంతరం  తెలిపినా వాటిని లెక్కచేయకుండా ఎకరం పొలంలో చెరువు తవ్వి చుట్టూ కట్టలు పోశాడు.  దీనిపై రెవెన్యూ సిబ్బంది అద్దంకి  పోలీస్ స్టేషన్‌లో  ఫిర్యాదు చేశారు.  నిబంధనల ప్రకారం సొంత భూముల్లో చెరువులు ఏర్పాటు చేయాలంటే  పంచాయితీ నుంచి నిరభ్యంతర పత్రం పొందాలి.  రెవెన్యూ, మత్స్యశాఖ అధికారులకు దరఖాస్తు సమర్పించాలి.  అధికారం అండతో నిబంధనలు తుంగలో తొక్కి చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.
Illegal Fishing Ponds By YSRCP Leaders : శింగరకొండ భవనాశి తటాకం చుట్టూ చేపల చెరువులు ఒక్కొక్కటిగా వెలుస్తున్నాయి. శింగరకొండపాలెం, చక్రాయపా లెం, కొత్తరెడ్డి పాలెం తదితర గ్రామాల పరిధిలో సుమారు 100కు పైగా చేపల చెరువులు ఏర్పాటయ్యాయి. సంబధిత అధికారులు వీటిపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఐపి  కృష్ణయ్యను వివరణ కోరగా వీఆర్వో పిర్యాదుపై పరిశీలన చేయించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.