LIVE: మండపేటలో చంద్రబాబు రా కదలిరా బహిరంగ సభ - ప్రత్యక్ష ప్రసారం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 20, 2024, 4:38 PM IST

Updated : Jan 20, 2024, 6:47 PM IST

thumbnail

Chandrababu Raa Kadalira Public Meeting: టీడీపీ ఆవిర్భావం నుంచి ఆదరిస్తున్న నియోజకవర్గమది పార్టీకి బ్రహ్మరథం పట్టి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావును 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు గెలిపించి అసెంబ్లీకి పంపిన ప్రాంతమది. అదే మండపేట. ఈ నియోజకవర్గ కేంద్రంలో టీడీపీ ప్రతిష్టాత్మకంగా ‘రా కదలి రా’ బహిరంగసభ జరుగుతోంది. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికల సమర శంఖాన్ని పూరించి శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు.
15 ఎకరాల్లో సభకు ఏర్పాట్లు: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మండపేట పట్టణంలోని గుమ్మిలేరు రోడ్డు టోల్‌గేట్‌ సమీపంలో 15 ఎకరాల్లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లా నుంచి వచ్చే నాయకులు, అభిమానులు, ప్రజల కోసం వాహనాల పార్కింగ్‌కు మూడుచోట్ల ప్రాంగణాలు సిద్ధంచేశారు. సభా వేదికకు అర కి.మీ దూరంలోని మండపేట బైపాస్‌ రోడ్డులో హెలిప్యాడ్‌ ఏర్పాటు చేశారు. ‘రా కదలిరా’ కార్యక్రమానికి లక్ష మందికి పైగా జనం వచ్చారు. మండపేటలో చంద్రబాబు రా కదలిరా బహిరంగ సభ ప్రత్యక్ష ప్రసారం మీ కోసం. 

Last Updated : Jan 20, 2024, 6:47 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.