LIVE: విశాఖలో వికసిత భారత్ విద్యార్థులతో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్​ ఇష్టాగోష్టి - NIRMALA SEETARAMAN

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 29, 2024, 10:53 AM IST

Updated : Apr 29, 2024, 11:09 AM IST

thumbnail

విశాఖలో వికసిత భారత్ విద్యార్థులతో ఇష్టాగోష్టి కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. స్వాతంత్య్రం సిద్ధించి వందేళ్లు పూర్తి కానున్న 2047 నాటికి మన దేశాన్ని అభివృద్ధి చెందిన/వికసిత భారత్‌గా మార్చే లక్ష్యానికి అనుగుణంగా భారతీయ కంపెనీలు పని చేస్తున్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. భవిష్యత్తు తరాలకు ఉత్తమ జీవనాన్ని అందించేందుకు వికసిత్‌ భారత్‌ లక్ష్యాన్ని చేరుకోవాల్సిందేనని ప్రధాని మోదీ స్పష్టంగా సూచించారని ఆమె పేర్కొన్నారు. ‘స్వాతంత్య్ర పోరాట సమయంలో పారిశ్రామిక వేత్తలు దేశంతో ఉన్నారు. వలస రాజ్యాల ఒత్తిడి ఉన్నా, దేశీయంగా పరిశ్రమలను, సామర్థ్యాన్ని నిర్మించారు. మన పారిశ్రామిక రంగం ఆ స్ఫూర్తిని కొనసాగిస్తోంది. అసమానతలకు వ్యతిరేకంగా జాతీయ ప్రయోజనాల కోసం ముందడుగు వేస్తూనే ఉంది. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిలిచేందుకు పరిశ్రమలు తమ వంతు సాయం అందిస్తే, తొలి లబ్ధిదారులు కూడా అవే అవుతాయ’ని నిర్మలా సీతారామన్‌ వివరించారు. మోదీ నేతృత్వంలో ఎన్‌డీఏ మూడోసారి అత్యధిక మెజార్టీతో అధికారంలోకి వచ్చి సంస్కరణలు కొనసాగిస్తుందని నిర్మలా సీతారామన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రపంచంలో అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగామని, భవిష్యత్తులో మూడో స్థానానికి ఎదగాలన్నది లక్ష్యంగా గుర్తు చేశారు. గీతం విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో వికసిత భారత్ లక్ష్య సాధన రానున్న కాలంలో దృష్టి సారించాల్సిన అంశాలపై  ఆమె వివరించారు.  

Last Updated : Apr 29, 2024, 11:09 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.