పెట్రోల్​ బంకులో చోరీకి యత్నం - ఏం దొరక్కపోవడంతో ఆ దొంగ ఏం చేశాడంటే? - MOBILE THEFT IN MADHIRA PETROL BUNK

By ETV Bharat Telangana Team

Published : May 12, 2024, 12:34 PM IST

thumbnail
బంకులో దొంగతనానికి వచ్చిన వ్యక్తి ఏమీ దొరక్కపోవడంతో ఏం చేశాడంటే (ETV Bharat)

Cell Phone Theft in Khammam Madhira Petrol Bunk Video : దొంగతనానికి వచ్చిన వ్యక్తిని ఏమీ దొరక్కపోవడంతో ఛార్జింగ్​ పెట్టిన సెల్​ఫోన్​తో చోరీ చేసిన ఘటన ఖమ్మం జిల్లా మధిరలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనపై యాజమాన్యం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

బంక్​ యాజమాన్యం తెలిపిన ప్రకారం : మధిర నియోజకవర్గంలో సిరిపురం వద్ద హెచ్​పీ పెట్లోల్​ బంక్​ ఉంది. అర్ధరాత్రి 1.20 గంటలకు బంకులోకి  ఒక వ్యక్తి వచ్చాడు. పెట్రోల్ పోసే స్టేషన్​ దగ్గర బండి పార్క్​ చేసి ఉంచాడు. చుట్టు పక్కల అంతా గమనించిన అతను  బంకులో సిబ్బంది గదికి వెళ్లాడు. ఏమైనా దొరుకుతుందా అని గదంతా చూశాడు ఏమీ దొరక్క పోవడంతో అక్కడే టేబుల్​పై ఛార్జింజ్​ పెట్టి ఉన్న సెల్​ఫోన్​ను తీసుకెళ్లాడు. ఈ ఘటన మధిర రూరల్​ పోలీస్ స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి దృష్యాలు సీసీ టీవీలో రికార్టు అయ్యాయి. వాటిని చూసిన బంకు యాజమాన్యం పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని  వ్యక్తిని గాలిస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.