మూడు రాజధానుల పేరుతో సీఎం జగన్ ప్రజలను మోసం చేశారు: సత్య కుమార్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 14, 2024, 11:44 AM IST

thumbnail

BJP Leader Satya Kumar Comments On AP Capital: మూడు రాజధానుల పేరుతో మూడు ప్రాంతాల ప్రజలను జగన్ మోసం చేశారని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ ఎద్దేవా చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి మరికొన్నాళ్లు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలని వైసీపీ నేతలు కొత్త పల్లవి ఎత్తుకున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే దిల్లీ వెళ్లానని పదేపదే చెబుతున్న ముఖ్యమంత్రి జగన్ హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని అంశాన్ని అక్కడెందుకు ప్రస్తావించలేదని గుంటూరు జిల్లా మంగళగిరిలో ప్రశ్నించారు. 

ఎన్నికల సమయం దగ్గరపడుతున్న తరుణంలో నీటి ప్రాజెక్టులపై జగన్​కు ఒక్కసారి ప్రేమ పుట్టుకొచ్చిందని సత్య కుమార్ విమర్శించారు. విద్వేషాల పేరుతో రాజకీయాలు చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. కుల, మత, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడమే జగన్ నైజం అని సత్యకుమార్ అన్నారు. ఎన్నికల ముందు అమరావతి తీర్మానానికి మద్దతు ఇచ్చి రైతులను మోసం చేశారని వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికలలో లబ్ధి పొందేందుకు అవసరమైతే చంద్రమండలాన్ని రాష్ట్ర రాజధానిగా ప్రకటించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఆయన తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.