చెట్లతాండ్రలో స్వామి వారి ఉత్సవాలు - ఆకట్టుకుంటున్న అరటి గెలల పందిరి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 20, 2024, 9:29 PM IST

thumbnail

Bhishma Ekadashi Celebrations in Srikakulam District : భీష్మ ఏకాదశి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం చెట్లతాండ్రలో వేలాది అరటి గెలలతో వేసిన పందిరి ఆకట్టుకుంటోంది. లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మూడు రోజులు పాటు జరిగే ఉత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్​, కర్ణాటక నుంచి భక్తులు వస్తుంటారు. భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశామని ఆలయ అధికారులు తెలిపారు. స్వామి వారిని దర్శనం కోసం భారీ భక్తులు తరలివచ్చారు.

200 ఏళ్ల క్రితం పరవస్తు చిన్నయసూరి వంశానికి చెందిన పరవస్తు అయ్యవారు లక్ష్మీనరసింహస్వామిని కొలువుదీర్చి పూజలు చేశారని స్థానికులు తెలియజేశారు. స్వామివారికి ఇష్టమైన పానకం తయారీకి అరటి గెలలు సమర్పించే వారని భక్తుల నమ్మకం. అప్పటినుంచి ఆచారం కొనసాగుతోందని స్థానికులు తెలిపారు. తమ కోర్కెలు నెరవేరేందుకు అరటి గెలలు కడుతామని భక్తులు తెలిపారు. తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.