ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై ఈసీకి ఫిర్యాదు - Atchannaidu complaint to EC

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 25, 2024, 5:07 PM IST

thumbnail

 Atchannaidu complaint against Sajjala Ramakrishna Reddy: ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిపై ఎన్నికల సంఘానికి తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు. సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రభుత్వ పదవిలో ఉంటూ రాజకీయ నాయకుడిలా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. గత ఐదేళ్ళుగా ప్రభుత్వ సలహాదారుడిలా కాకుండా వైసీపీ కార్యకర్తలా ప్రతిపక్షాలపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ సంచిత నిధి నుంచి జీతం తీసుకుంటూ ప్రభుత్వ ఖజానా ఖర్చుతో అధికార పార్టీ పనులు చేస్తున్నారని ఆక్షేపించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ మార్చి 18, 22న ప్రెస్ మీట్‌లు పెట్టి ప్రతిపక్షాలపై బహిరంగ ఆరోపణలు చేశారని అచ్చెన్న లేఖలో పేర్కొన్నారు. 

 ఎన్నికల నియమావళి ప్రకారం రాజకీయ నాయకులు, అధికారుల మధ్య వ్యక్తిగతంగా లేదా సమిష్టిగా వీడియో కాన్ఫరెన్సులు నిషేధమని, అందుకు విరుద్ధంగా వైసీపీ నాయకులు, అభ్యర్ధులతో సజ్జల భేటీలు, వీడియో కాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నారని అచ్చెన్న  మండిపడ్డారు. ఐపీసీ 171 , 123, 129, 134,  134 A సెక్షన్‌ల ఉల్లంఘన, సీఆర్పీ 1951 యాక్ట్‌కు విరుద్ధంగా సజ్జల వ్యవహరించారని అచ్చెన్న తెలిపారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించనందుకు గాను అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయడు డిమాండ్ చేశారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించడం కోసం సలహాదారు పదవి నుంచి సజ్జలను తొలగించాలని ఈసీని కోరారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.