6,100 పోస్టులు 40లక్షల మంది నిరుద్యోగులకు ఎలా సరిపోతాయి : ఏపీజేఏసీ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 8, 2024, 10:08 AM IST

thumbnail

AP Unemployment JAC Agitation in Visakhapatnam : ఎన్నికలకు ముందు 23 వేల డీఎస్సీ పోస్టులు ఉన్నాయన్న సీఎం జగన్‌ మోహన్ రెడ్డి ఇప్పుడు 6 వేల వంద పోస్టులను మాత్రమే విడుదల చేశారని విశాఖలో ఏపీ నిరుద్యోగ జేఏసీ ఆందోళన చేసింది. 40 లక్షల మంది నిరుద్యోగ యువతకు 6 వేల వంద పోస్టులు ఎలా సరిపోతాయని ప్రభుత్వాన్ని నిలదీసింది. డీఎస్సీ పోస్టుల సంఖ్యను పెంచాలని డిమాండ్‌ చేస్తూ నిరుద్యోగులు భిక్షాటన చేశారు. ప్రతి ఏటా 6,500 పోలీస్ శాఖ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని, 15,004 సచివాలయాలలో డిజిటల్ గ్రంథాలయాలు ఏర్పాటు చేసి ఉద్యోగ భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం జగన్ ఇచ్చిన హామీలను మరిచి తుంగలో తొక్కారని బాధను వ్యక్తం చేశారు. 

CM Jagan Promises to Unemployment : ఏపీపీఎస్సీ, ఏపీడీఎస్సీ ఉద్యోగాలకు అభ్యర్థుల వయోపరిమితిని 47కు పెంచాలని ఏపీ నిరుద్యోగ జేఏసీ సభ్యులు నిరసన చేశారు. ఎన్నికలలోపు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే తమ సత్తా ఏంటో చూపుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత కుమార్​తో పాటు జేఏసీ ప్రధాన కార్యదర్శి ఉమ్మడి మహేష్, వోలి సంతోష్, రాజేష్, వినీత్ పెద్ద ఎత్తున యువత పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.