అమరావతి దళిత జేఏసీ కన్వీనర్ లూథర్​బాబు గుండెపోటుతో మృతి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 20, 2024, 9:00 PM IST

thumbnail

Amaravati Dalit JAC Convener Martin Luther Babu Died: అమరావతి దళిత జేఏసీ (Joint Action Committee) కన్వీనర్ గడ్డం మార్టిన్ లూథర్​ బాబు (gaddam martin luther babu) గుండెపోటుతో మరణించారు. నాలుగు రోజుల క్రితం అస్వస్థతకు గురవడంతో మార్టిన్ లూథర్ బాబును తాడేపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం మార్టిన్ ప్రాణాలు కోల్పోయారు. 

గడ్డం మార్టిన్ లూథర్ బాబు మృతి ఉద్యమానికి తీరని లోటు అని, ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని అమరావతి ఐకాస నాయకులు చెప్పారు. అమరావతి ఉద్యమంలో దళితులను ముందుకు నడిపించడంలో మార్టిన్ లూథర్ బాబు చేసిన పోరాటం వృథా కాదని పేర్కొన్నారు. అమరావతి కోసం చేస్తున్న ఉద్యమం చివరి దశకు వచ్చిన సమయంలో మార్టిన్​ను కోల్పోవడం తమకు తీరని లోటు అని ఐకాస నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం మార్టిన లూథర్ బాబు అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.