ETV Bharat / technology

ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్ - వెంటనే ఆ Apps డిలీట్ చేయండి - లేకుంటే ఇక అంతే! - Android Phone Users Alert

author img

By ETV Bharat Telugu Team

Published : May 7, 2024, 1:30 PM IST

Android Phone Users Alert : ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లకు అలర్ట్​. హ్యాకర్స్ ఆండ్రాయిడ్​ ఫోన్లలోని లోపాలను ఆసరా తీసుకుని, దానిని హ్యాక్​ చేస్తున్నారని మైక్రోసాఫ్ట్ సంస్థ హెచ్చరించింది. హ్యాక్ చేసిన ఫోన్​లోని డేటా మొత్తాన్ని సైబర్ నేరగాళ్లు యాక్సెస్ చేయగలుగుతున్నారని పేర్కొంది. పూర్తి వివరాలు మీ కోసం.

Dirty Stream malware attack
Android Phone Users Alert (ETV BHARAT TELUGU TEAM)

Android Phone Users Alert : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆండ్రాయిడ్ ఫోన్లను వాడుతున్నారు. వాళ్లను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు 'డర్టీ స్ట్రీమ్' అనే ఒక మాల్వేర్​ను ప్రయోగిస్తున్నారు. దీనితో యూజర్ల ఫోన్​ను హ్యాక్ చేసి, వాళ్ల డివైజ్​ను పూర్తిగా కంట్రోల్​లోకి తెచ్చుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న మైక్రోసాఫ్ట్ కంపెనీ సెక్యూరిటీ టీమ్ - ఆండ్రాయిడ్ యూజర్లను జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తోంది.

ఆండ్రాయిడ్​ ఆపరేటింగ్ సిస్టమ్​లోని అత్యంత కీలకమైన కంటెంట్​ ప్రొవైడర్​ సిస్టమ్​ను లక్ష్యంగా చేసుకుని డర్టీ స్ట్రీమ్ అనే మాల్వేర్​ దాడి చేస్తుంది. తరువాత ఆ డివైజ్​ను పూర్తిగా తన కంట్రోల్​లోకి తీసుకుంటుంది. యూజర్ల ప్రమేయం లేకుండా, ఇంటర్ యాప్​ కమ్యునికేషన్, ఫైల్ షేరింగ్ చేయగలుగుతుంది. ఈ విధంగా హ్యాకర్లు ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్ల డేటాను సులువుగా యాక్సెస్ చేయగలుగుతున్నారు. అలాగే డివైజ్ ఫంక్షనాలిటీని కూడా మార్చగలుగుతున్నారు. ఇది యూజర్ల ప్రైవసీకి, భద్రతకు పెనుముప్పుగా మారే ప్రమాదం ఉంది.

ఈ యాప్స్​ను వెంటనే అన్​ఇన్​స్టాల్​ చేయండి!
ప్లేస్టోర్​లో పలు దుర్భలమైన, హానికరమైన యాప్స్ ఉన్నట్లు మైక్రోసాఫ్ట్ భద్రత సిబ్బంది గుర్తించారు. ఆ యాప్స్​ అన్నీ కలిపి సుమారుగా 4 బిలియన్ల డౌన్​లోడ్స్​ కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. వాటిలో ప్రధానమైన యాప్స్​ :

  • షావోమీ ఫైల్ మేనేజర్​ - 1 బిలియన్ డౌన్​లోడ్స్​
  • డబ్ల్యూపీఎస్​ (WPS) ఆఫీస్​ - 500 మిలియన్ డౌన్​లోడ్స్​

వాస్తవానికి ఈ యాప్​ల కోసం సెక్యూరిటీ ప్యాచ్​లను విడుదల చేశారు. అయినప్పటికీ ఇవి ఎంత వరకు పనిచేస్తాయో చెప్పలేము. కనుక వెంటనే ఈ యాప్​లను అన్ఇన్​స్టాల్​ చేయాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు.

రక్షణ లేదా?
సైబర్ దాడుల నుంచి రక్షణ పొందాలంటే, కచ్చితంగా అధికారిక ప్లే స్టోర్​ల నుంచి మాత్రమే యాప్స్​ డౌన్​లోడ్ చేసుకోవాలి. థర్డ్-పార్టీ యాప్​లను, అనధికారిక సోర్స్​ల్లో ఉండే యాప్​లను ఇన్​స్టాల్​ చేయకూడదు. కచ్చితంగా గూగుల్ ప్లే ప్రొటక్ట్​ను ఎనేబుల్ చేసుకోవాలి. అప్పుడే ఈ బిల్ట్​-ఇన్​ మాల్వేర్ ప్రొటక్షన్ ఫీచర్​ - మీరు డౌన్​లోడ్​ చేసిన యాప్​లను పూర్తిగా స్కాన్​ చేసి, వైరస్​లు, మాల్వేర్​లు ఉంటే మిమ్మల్ని హెచ్చరిస్తుంది.

సైడ్​ లోడింగ్ యాప్స్ వద్దు!
మీ డివైజ్​లో ఎట్టి పరిస్థితుల్లోనూ యాప్స్​ సైడ్ లోడింగ్ కాకుండా చూసుకోండి. ఎందుకంటే, సైడ్​ లోడింగ్ యాప్స్​ వల్ల ప్రమాదకరమైన వైరస్​లు, మాల్వేర్​లు మీ డివైజ్​లోకి ప్రవేశించే అవకాశం ఉంది.

మీ ఫోన్​ కెమెరాను Apps యాక్సెస్​ చేస్తున్నాయా? వెంటనే బ్లాక్ చేసేయండిలా! - App Permissions For Protect Data

డేంజర్ సిగ్నల్స్​ - మనిషిలా ఆలోచించే AGI రోబోలు వచ్చేస్తున్నాయ్​ - ఇక మానవాళికి ముప్పు తప్పదా? - Artificial General Intelligence

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.