ETV Bharat / state

నాడు ఉరి తీయాలన్నవాడే - నేడు తండ్రి అయ్యాడా?: వైఎస్ షర్మిల - YS Sharmila criticized CM Jagan

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 24, 2024, 3:25 PM IST

YS Sharmila criticized CM Jagan: ఐదేళ్లుగా రైతులను, యువతను సీఎం జగన్‌ మోసం చేశారని కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు. బాపట్ల జిల్లా రేపల్లెలో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. బొత్సను తండ్రి సమానులంటూ, నిన్న జగన్‌ చెప్పిన వ్యాఖ్యలపై షర్మిల స్పందించారు. వైఎస్​ని తిట్టినవాళ్లను జగన్‌ తన పక్కనపెట్టుకుని తిరుగుతున్నారని విమర్శించారు.

Etv Bharat
Etv Bharat

నాడు ఉరి తీయాలన్నవాడే - నేడు తండ్రి అయ్యాడు: షర్మిల

YS Sharmila criticized CM Jagan: బొత్స సత్యనారాయణ జగన్​కి తండ్రి సమానులు అంట అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎద్దేవాచేశారు. ఇదే బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో వైఎస్సార్​ను తిట్టిపోసిన వ్యక్తి అని ఆమె అన్నారు. ఇదే బొత్స వైఎస్సార్​ను తాగుబోతు అని తిట్టాడు, ఇదే బొత్స జగన్​కు ఉరి శిక్ష వేయాలని అన్నాడని అన్నారు. జగన్​మోహన్​రెడ్డి బినామీలు అన్నాడని అన్నారు. విజయమ్మను సైతం అవమాన పరిచాడన్న షర్మిల, ఇలాంటి బొత్స జగన్ కి తండ్రి సమానులు అయ్యారని విమర్శించారు.

జగన్ క్యాబినెట్​లో ఉన్న వాళ్లు అందరు వైఎస్ఆర్​ను తిట్టిన వాళ్లేనని వైఎస్ షర్మిల అన్నారు. వైఎస్సార్​ను తిట్టిన వాళ్లకే జగన్ పెద్దపీట వేశారని విమర్శించారు. వీళ్లందరూ తండ్రులు, అక్కలు, చెల్లెళ్లు అని అన్న షర్మిల, నిజంగా ఆయన కోసం పని చేసిన వాళ్లు ఈయనకు ఏమీ కారని విమర్శించారు. ఆయన కోసం పాదయాత్రలు చేసిన వాళ్లు ఏమి కారని ఎద్దేవా చేశారు. ఆయన కోసం పని చేసి గొడ్డలి పోటుకు గురైన వాళ్లు ఏమీ కారని అన్నారు. వైఎస్సార్​సీపీ పేరులో వైఎస్సార్ లేడని అన్నారు. వై అంటే వైవీ సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయి రెడ్డి, ఆర్ అంటే రామకృష్ణా రెడ్డి అని షర్మిల అన్నారు. గతంలో రాజశేఖరరెడ్డిని తిట్టిన రోజా, బొత్స సత్యనారాయణ, విడదల రజినీలను జగన్ పక్కన పెట్టుకొని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.

జగన్‌ ఏలుబడిలో అటకెక్కిన జలయజ్ఞం - సాగునీటి ప్రాజెక్టులకు అన్యాయం - NEGLIGENCE ON JALAYAGNAM

రాజశేఖరరెడ్డి రైతును నెత్తిన పెట్టుకుంటే.. సీఎం జగన్ రైతులను నాశనం చేశాడని విమర్శించారు. రాష్ట్రంలో అప్పులు లేని రైతు లేడని తెలిపారు. ప్రతి సంక్రాంతికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చిన జగన్, ఇప్పటి వరకూ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేయలేదని ఎద్దేవా చేశారు. ఇలాంటి వారు రాజశేఖరరెడ్డి ఆశయాలను నిలబెడతారా అంటూ ప్రశ్నించారు. గతంలో జగన్ రేపల్లెకు వచ్చినప్పుడు అనేక హామీలు ఇచ్చారు. అమలు చేశారా అని ప్రశ్నించారు. లక్ష ఎకరాలకు నీరు ఇస్తామన్నారు ఇచ్చారా అని ప్రశ్నించారు. వంద పడకల ఆసుపత్రి అన్నారు వచ్చిందా అని అడిగారు.

నిన్న విజయనగరం జిల్లాలో నిర్వహించిన సిద్ధం సభలో సీఎం జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన ఎమ్మెల్యే, అభ్యర్థులను పరిచయం చేశారు. అందులో భాగంగా బొత్స సత్యనారాయణను పరిచయం చేస్తూ మాట్లాడిన జగన్, బొత్స సత్యనారాయణ తనకు తండ్రిలాంటి వాడని తెలిపారు. తాను అన్నా అని పిలుస్తానని, కానీ నాకు తండ్రితో సమానం అని జగన్ పేర్కొన్నారు.

చెల్లమ్మ ప్రశ్నకు బిక్కమొహం వేసిన జగనన్న - YCP Social Media Activists

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.