ETV Bharat / state

వైఎస్సార్సీపీకి గుడ్​బై- రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేనలో భారీగా చేరికలు - YCP JOINed JSP AND TDP

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 15, 2024, 11:00 AM IST

YCP Leaders Joining in JSP and TDP: ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకి మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. రాష్ట్రంలో వలసల పరంపర కొనసాగుతూనే ఉంది. వైసీపీ నుంచి పలువురు నేతలు అసంతృప్తితో ఆ పార్టీని వీడుతున్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో నాలుగు మండలాల నుంచి సుమారు మూడు వేల మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు జనసేనలో చేరారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం 100 మంది వైసీపీ నేతలు లోకేశ్​ సమక్షంలో టీడీపీలో చేరారు.

YCP Leaders Joining in JSP And TDP
YCP Leaders Joining in JSP And TDP

YCP Leaders Joining in JSP And TDP: వైసీపీ రాక్షస పాలన నుంచి మరికొద్ది రోజుల్లో ప్రజలకు విముక్తి లభిస్తుందని విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన అభ్యర్థి లోకం మాధవి అన్నారు. నెల్లిమర్ల నియోజకవర్గంలో నాలుగు మండలాల నుంచి వైసీపీ శ్రేణులు సుమారు మూడు వేల మంది జనసేనలో చేరారు. వారికి లోకం మాధవి జనసేన కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వని ఈ ప్రభుత్వం మద్యం ధరలు పెంచి ప్రోత్సహిస్తుందని మాధవి మండిపడ్డారు. నియోజకవర్గంలో అవినీతి అనకొండగా పేరొందిన వైసీపీ ఎమ్మెల్యే అప్పలనాయుడిని ఓడించాలనే ధ్యేయంతో ప్రజలు ఉన్నారని ఈ ప్రభంజనంతో తెలుస్తుందన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎన్డీఏలోకి జోరుగా చేరికలు- వైసీపీని వీడుతున్న నేతలు - Joined TDP from YCP

YCP Leaders Join the TDP: సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం వైసీపీకి చెందిన కీలక నేత శెట్టివారి రాజశేఖర్ టీడీపీలో చేరారు. హైదరాబాద్​లోని లోకేశ్​ నివాసంలో రాజశేఖర్​తో పాటు 100 మంది ఆ పార్టీ నేతలు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ లోకేశ్​ పసుపు కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. విజయవాడకు చెందిన పలువురు ప్రముఖులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ సమక్షంలో పార్టీలో చేరారు. చెన్నుపాటి శ్రీనివాస్, పరమేశ్​లు టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని నేతృత్వంలో పసుపు కండువా కప్పుకున్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని లోకేశ్​ స్పష్టం చేశారు.

వైసీపీకి వరుస షాక్​లు - ఓ వైపు రాజీనామాల పర్వం, మరోవైపు అసమ్మతి సెగలు

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలోని మురపాక పంచాయతీకి చెందిన 355 వైసీపీ కుటుంబాలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరాయి. వారికి కూటమి అభ్యర్ధులు పసుపు కండువా కప్పి స్వాగతం పలికారు. ఎన్నికల్లో అంతా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని నేతలు అభిప్రాయపడ్డారు. సీఎం జగన్​ను గద్దెదించితే తప్ప ఈ రాష్ట్రం అభివృద్ది చెందదని కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో సీఎంను ఇంటికి పంపకపోతే రాష్ట్ర ప్రజలు పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని విమర్శించారు.

తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని పలు పంచాయతీలకు చెందిన సుమారు 350 మంది వైసీపీ శ్రేణులు టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని ఆధ్వర్యంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. యర్రావారిపాలెం మండలంకు చెందిన మరో రెండు వందల మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తూ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని పులివర్తి నాని హామీ ఇచ్చారు.

విశాఖలో వైఎస్సార్సీపీకి భారీ షాక్- టీడీపీ, జనసేనలో చేరికలు - Some YCP Leaders Join TDP

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.