ETV Bharat / state

ప్రచారానికి 15 మందిని తీసుకొస్తావా ! - వృద్ధురాలిని చెప్పుతో కొట్టిన వైసీపీ నేత - YCP LEADER ATTACK ON OLD WOMAN

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 26, 2024, 9:31 PM IST

Updated : Mar 27, 2024, 9:02 AM IST

YCP Leader attack an old Woman With Sandal: రాష్ట్రంలో వైసీపీ నేతలు దాడులు, అరచకాలతో పేట్రేగి పోతున్నారు. ఎన్నికల ప్రచారానికి ఓ వృద్ధురాలు ఐదుగురిని ఎక్కువ తీసుకొచ్చిందని వైసీపీ నేత బంధువు పార్టీ కార్యాలయంలోనే దాడికి పాల్పడ్డాడు. అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా ఆమెపై చెప్పుతో దాడి చేశాడు. పోలీసులు తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటోంది ఆ వృద్ధురాలు.

YCP Leader attack an old Woman With Sandal
YCP Leader attack an old Woman With Sandal

YCP Leader attack an old Woman With Sandal: వైసీపీ నేతలు అధికారంలో ఉన్నామనే గర్వం, అహంకారంతో ప్రజలపై దాడులకు పాల్పడుతూ ఇష్టాగోష్టిగా వ్యవహరిస్తున్నారు. ఓ వృద్ధురాలు ఎన్నికల ప్రచారానికి ఎక్కువ మంది మహిళలను తీసుకొచ్చిందనే కోపంతో ఆమెపై దాడి చేసిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. అసలు ఏం జరిగిందంటే జిల్లాలోని కదిరి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మక్బూల్ అహమ్మద్ బంధువు ఓ వృద్ధురాలిపై దాష్టీకానికి పాల్పడ్డాడు. పట్టణానికి చెందిన వృద్ధురాలైన వహీదాను ఎన్నికల ప్రచారానికి 10 మందిని పిలవగా 15 మంది మహిళలను వైసీపీ కార్యాలయానికి తీసుకెళ్లింది. దీంతో అక్కడ ఉన్న మక్బూల్ అహ్మద్ బావ నియోజకవర్గ ఛైర్మన్​ పరికి షామీర్ భాషా ప్రచారానికి ఎందుకు 15 మందిని మహిళలను తీసుకొచ్చావని ఆ వృద్ధురాలిని తీవ్ర పదజాలంతో దూషించాడు. ఎందుకు తిడుతున్నావ్ అంటూ వహీదా ప్రశ్నించగా వెంటనే అతడు ఆగ్రహంతో వృద్దురాలనే మర్యాద లేకుండా ఆమెపై అసభ్యకర పదజాలంతో దుర్భాషలాడుతూ చెప్పుతో దాడి చేశాడు.

పల్నాడులో రెచ్చిపోతున్న వైసీపీ నేతలు.. టీడీపీ కార్యకర్తల కుటుంబంపై మరోసారి దాడి..

ఎన్నికల ప్రచారానికి 10మందిని తీసుకు రమ్మంటే 15 మంది వెళ్లడం జరిగింది. పది మంది రమ్మంటే పదిహేను మంది ఎందుకు వచ్చారని నోటికి అసభ్యంగా తిట్టారు. పది మందికి మాత్రమే డబ్బులు ఇవ్వండి అన్నాం. వయసులో పెద్దదాన్ని అని చూడకుండా అసభ్యకరంగా ప్రవర్తించాడు. అతడు ప్రవర్తించినా దృశ్యాలు సీసీ ఫుటేజిలో స్పష్టంగా ఉంటాయి. అతడు నన్ను కాలితో తన్ని చెప్పుతో నా తలపై దాడి చేశాడు. నాపై దాడి చేసిన వ్యక్తిని శిక్షించి నాకు న్యాయం చేయాలి. లేదంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను. -వహీదా, బాధితురాలు

Victim Says Commit Suicide Justice Not Done: తోటి మహిళలు అడ్డుకునేందుకు ప్రయత్నించినా అతడు చిందులేస్తూ మీ అంతు చూస్తానంటూ బెదిరించాడు. అనారోగ్యంతో బాధపడుతున్న భర్తకు మందుల కోసమని ఎన్నికల ప్రచారానికి వస్తే పవిత్రమైన రంజాన్ మాసంలో అపవిత్రమైన మాటలు పడాల్సి వచ్చిందని ఆ వృద్ధురాలు వాపోయారు. తల్లి వయసు కలిగిన తనను అనరాని మాటలు అంటూ చెప్పుతో కొట్టిన పరికి షామీర్​పై పోలీసులు కేసు నమోదు చేయాలని ఆమె కోరారు. కేసు నమోదు చేయని పక్షంలో తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు తమ ఇంటి వచ్చి మమ్మల్ని చంపేస్తారని ఆమె రోదించారు.

ప్రజాగళం సభకు వెళ్లాడని టీడీపీ కార్యకర్తపై వైసీపీ కార్యకర్తలు దాడి- ఓటమి భయంతోనే దాడి చేశారన్న అచ్చెన్నాయుడు

Last Updated : Mar 27, 2024, 9:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.