ETV Bharat / state

గన్నవరాన్ని గాలికొదిలేసిన జగన్ - ఐదేళ్లలో అభివృద్ధి ఊసేలేదు ​ - YCP did not develop Gannavaram

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 14, 2024, 2:59 PM IST

YCP Government Not Care the Development of Gannavaram కృష్ణా జిల్లాలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ జమానాలో చెప్పుకోదగ్గ రీతిలో అభివృద్ధి జరగలేదు. జగన్‌ హయాంలో సిమెంట్‌ రహదారుల ఊసే లేకుండా పోయింది. గత ప్రభుత్వం రాష్ట్రంలోనే అత్యధికంగా రహదారులు అభివృద్ధి చేసిన ఘనత దక్కించుకుంది. నియోజకవర్గంలో దాదాపు 20 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా గాలిలో పెట్టేశారు. ఎక్కడికక్కడ పనులు ఏమి ఇంకా పూర్తి చేయనేలేదు. కొత్త సంస్థలను తీసుకోచ్చింది లేదు.

YCP Government Not Care Development of Gannavaram
YCP Government Not Care Development of Gannavaram

YCP Government Not Care the Development of Gannavaram: సీఎం హోదాలో ఉన్న జగన్‌ గడచిన ఐదు సంవత్సరాలుగా గన్నవరం నియోజకవర్గం నుంచి తరచూ రాకపోకలు సాగిస్తూనే ఉన్నారు. అది ప్రేమతోనో, అభివృద్ధి కోసమో కాదు కేవలం విమానం ఎక్కి రాష్ట్రమంతటా పర్యటించడానికి మాత్రమే వచ్చి వెళుతుంటారు. 58 నెలలు సీఎంగా ఉన్న ఆయన ఇంతవరకు ఒక్కసారి కూడా నియోజకవర్గంలో పర్యటించింది లేదు. జగన్​ చెప్పుకోదగ్గ రీతిలో మచ్చుకు ఒక్కటి కూడా అభివృద్ధి పని చేయలేదు. కానీ నియోజకవర్గంలో బస్సు యాత్ర చేయడానికి వస్తున్న జగన్‌, ప్రజలకు ఏం చెబుతారు? ఏమని ఓటడుగుతారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఇంకా సిద్ధం పోస్టర్లు - ఫొటోలు తీసిన టీడీపీ నేతలు

2014 నుంచి 2019 మధ్య కాలంలో కేసరపల్లిలో ఉన్న ఐటీ పార్కులో దాదాపు 20కి పైగా సంస్థలు కొలువుదీరాయి. వేల సంఖ్యలో ఉద్యోగాలు కల్పించాయి. కానీ 2019 నుంచి ఇప్పటి వరకు కొత్త సంస్థ ఒక్కటి రాకపోగా ఉన్న సంస్థలన్నీ ఒక్కొక్కటిగా వెళ్లిపోయాయి. దీంతో స్థానిక యువతకు ఉద్యోగాలు, ప్రజలకు ఉపాధి అవకాశాలకు గండిపడిపోయింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోనే అత్యధికంగా రహదారులు అభివృద్ధి చేసిన ఘనత దక్కింది. 84 గ్రామ పంచాయతీలకు 70 పంచాయతీల్లో అంతర్గత రహదారులను సిమెంట్‌ రోడ్లుగా మార్చారు. ప్రధాన మార్గాలు, అనుసంధాన రహదారులను సైతం పునర్నిర్మించారు. కొన్ని రహదారులను రవాణా అవసరాలకు వీలుగా విస్తరించారు. కానీ జగన్‌ హయాంలో సిమెంట్‌ రహదారుల ఊసే లేకపోగా ప్రధాన, అంతర్గత రోడ్లకు నిధులు కేటాయించి కూడా పనులు పూర్తి చేయించలేకపోయారు.

నవరత్నాల పేరుతో జగన్ నయవంచన - అసలు విషయం ఏంటంటే?

డీలా పడిన పరిశ్రమలు: 2014-19 మధ్య కాలంలో నియోజకవర్గం పారిశ్రామిక కేంద్రంగా ఆవిర్భవించింది. వీరపనేనిగూడెం, మల్లవల్లిలో అనేక సంస్థలు తమ యూనిట్ల స్థాపనకు ముందుకొచ్చాయి. మల్లవల్లిలో ఏకంగా 1,360 ఎకరాల్లో అతిపెద్ద పారిశ్రామికవాడకు రూపకల్పన చేశారు. అశోక్‌ లేల్యాండ్‌, పార్లే ఆగ్రో వంటి దిగ్గజ సంస్థలు యూనిట్ల ఏర్పాటుకు ముందుకు రావడం జరిగింది. కానీ వైసీపీ అధికారంలోకి రాగానే వీటితో సహా అనేక సంస్థలు వెనక్కి వెళ్లిపోయాయి.

Jagan did Not Give House Tracks: నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల కార్యక్రమంలో భాగంగా అర్హులైన అందరికీ ఇంటి స్థలాలు ఇస్తున్నామంటూ గొప్పలు చెప్పుకున్న జగన్‌ నియోజకవర్గంలో దాదాపు ఇంకా 20 వేల మందికి స్థలాలు ఇవ్వకుండా గాలిలో పెట్టేశారు. ఎన్నికల కోడ్‌ వచ్చే వరకు అదిగో ఇంటి పట్టా, ఇదిగో స్థలం అంటూ లబ్ధిదారులతో దోబుచులాట ఆడి చివరకు వారికి మొండిచెయ్యి చూపారు. ఇచ్చిన లేఔట్లలో కూడా చాలా వాటికి రహదారి సౌకర్యమే కల్పించకుండా మమ అన్పించారు.

జగన్ చేసేవి శవ రాజకీయాలు - నావి ప్రజా రాజకీయాలు: చంద్రబాబు

అన్నింటిలోనూ వెనకంజే: గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, ఆరోగ్య క్లినిక్‌ భవనాల నిర్మాణం, రెండో విడత నాడు-నేడు పనులు, జగనన్న లేఔట్లలో మౌలిక వసతుల కల్పన, జలజీవన్‌ మిషన్‌ ద్వారా ఇంటింటికి కుళాయి సౌకర్యం కల్పించే పనులు, ఉంగుటూరు వద్ద బుడమేరుపై వంతెన, రామవరప్పాడులో ఏలూరు కాలువ పైవంతెన నిర్మాణాలు, సీఎం సహాయనిధి మంజూరు, మల్లవల్లి పారిశ్రామికవాడ, గన్నవరం విమానాశ్రయం నిర్వాసితులకు పరిహారం, పునరావాసం వంటి కీలక పనులు ఎక్కడికక్కడే ఉండిపోయాయి.

'ప్రకాశించని నవరత్నాలు - జగన్‌ మోసపు లీలలు'..పుస్తకం విడుదల చేసిన టీడీపీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.