ETV Bharat / state

తాగునీటి సమస్యపై మహిళల నిరసన సెగ- ఎట్టకేలకు బస్సు దిగొచ్చిన సీఎం జగన్ - Women Protest CM Jagan

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 30, 2024, 10:28 AM IST

Women Protest to CM Jagan in Kodamuru : సీఎం జగన్​ మోహన్​ రెడ్డి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రకు మూడోరోజు కూడా నిరసన సెగ తగిలింది. తాగు నీటి సమస్య పరిష్కరించాలంటూ ఖాళీ బిందెలతో మహిళలు సీఎం బస్సును అడ్డుకున్నారు.

cm_jagan_campaign
cm_jagan_campaign

YS Jagan memantha Siddham Bus Yatra Women Protest in Kodamuru : గాల్లో తిరుగుతూ విహంగ వీక్షణం చేసే సీఎం జగన్‌కు అయిదేళ్ల తర్వాత రోడ్డెక్కే సరికి ప్రజల ఇబ్బందులు కంటికి కనిపించాయి. ఎప్పుడూ బారికేడ్లు, పరదాల మాటున దాక్కుని వెళ్లే జగన్‌కు జనం గోడు కనిపించలేదు. ఓట్ల కోసం తప్పక బంధనాలు దాటి బయటకు వచ్చిన జగన్‌కు పేదప్రజల దాహం కేకలు ఎదురేగి స్వాగతం పలికాయి. ఆయన బస్సుయాత్ర చేపట్టిన మూడోరోజే కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌కు నిరసన సెగ తగిలింది. మంచినీళ్లివ్వండి మహాప్రభో అంటూ మహిళలు ఆయన బస్సును అడ్డుకోవడం కలకలం రేగింది.

నిరసనలు, ఆందోళనలతో జగన్ బస్సు యాత్ర! సభకు వచ్చిన వారికి డబ్బులు- వీడియోకు చిక్కిన వైసీపీ నేతలు - Ys Jagan Memantha Siddham Bus Yatra

Kurnool District : కర్నూలు జిల్లాలో బస్సుయాత్ర చేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌కు నిరసన సెగ తగిలింది. గూడూరు మండలం పెంచికలపాడు నుంచి ఎమ్మిగనూరు లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు బస్సులో వెళ్తుండగా కొత్తూరులో ఖాళీ బిందెలతో మహిళలు స్వాగతం పలికారు. ఆయన బస్సును అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కొంత కలకలం రేగింది.

సీఎం జగన్​కు నిరసన సెగ : మహిళలను ఆందోళన చూసి బస్సు ఆపి కిందకు దిగిన జగన్‌ వారి ఇబ్బంది అడిగి తెలుసుకున్నారు. 1200 మంది జనాభా ఉన్న తమ గ్రామానికి ఎల్​ఎల్​సీ నుంచి నీటికుంటకు నీటిని అందించి అక్కడి నుంచి గ్రామంలోని ట్యాంకు ద్వారా గతంలో తాగునీరు సరఫరా చేసేవారని మహిళలు వివరించారు. ఇప్పుడు పైపులైన్లు సరిగా లేకపోవడంతో తాగునీరు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పకుండా సమస్య పరిష్కరిస్తామని సీఎం జగన్ వారికి హామీ ఇచ్చి ముందుకు కదిలారు.

ఎలా మాట్లాడాలో ముందే శిక్షణ - భజనలా ప్రజలతో సీఎం జగన్​ ముఖాముఖి - CM Jagan Sabha In Erraguntla

కోడుమూరులో తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ వామపక్షాలు నిరసన తెలిపాయి.సీపీఐ, సీపీఎం నాయకులు ప్లకార్డులు పట్టుకుని సీఎం బస్సు యాత్రను అడ్డునే ప్రయత్నం చేశారు. కోడుమూరులో దశాబ్దాలుగా తాగునీటి సమస్యను పరిష్కరించలేదని ఈ సందర్భంగా వామపక్ష నాయకులు నినాదాలు చేశారు. ఎస్​ఎస్​ ట్యాంకు నిర్మించి కోడుమూరు గ్రామానికి నీరందించాలని డిమాండ్​ చేశారు. వారినీ పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్​కు తరలించారు. సీఎం జగన్​ మోహన్​ రెడ్డి వెళ్లిన తర్వాత వదిలిపెట్టారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.